Movies17 ఏళ్ల వయసులోనే ముసలి హీరోతో పరమ చెత్త పని.. ఒళ్లు...

17 ఏళ్ల వయసులోనే ముసలి హీరోతో పరమ చెత్త పని.. ఒళ్లు జుగుప్స కలిగించే విషయాలను బయట పెట్టిన స్టార్ బ్యూటీ..!

ఇది రీల్ స్టోరీకి ఏమాత్రం తీసుకొని రియల్ స్టోరీ అని చెప్పాలి. ఈ రియల్ స్టోరీ లోను వెండితెరపై నటీనటులుగా వెలిగిపోయిన‌ ఇద్దరి మధ్య గుడ్డి ప్రేమ ఒకరిని దారుణంగా మోసపోయేలా చేసిందని చెప్పాలి. మరి ఇందులో మోసపోయినది ఒక పాపులర్ నటి కావడం విశేషం. ఆ నటి ఎవరో కాదు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ సినిమాలలో చిన్నవయసులోనే మంచి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అంజు. అంజు 17 ఏళ్ల వయసులో తాను ఎలా మోసపోయినో ? చెప్పిన మాటలు వింటే మనం ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. 17 ఏళ్ల వయసులో కళ్ళు మూసుకుపోయి ఆమె తీసుకున నిర్ణయం ఆమె జీవితాన్ని సమస్యల వలయంలోకి నెట్టివేసింది.

అంజును చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఒక సినిమా ఫంక్షన్ కు తీసుకువెళ్లిందట. అక్కడ డైరెక్టర్ మహేంద్రన్ ఆమెను చూసి సినిమాలలో అవకాశం ఇస్తానని చెప్పడంతో అలా అంజు బాల్యంలోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక 17 ఏళ్ల వయసులో అంజు కన్నడ సినిమాలు చేస్తున్న సమయంలో అప్పటి స్టార్ నటుడు టైగర్ ప్రభాకర్ ను చూసి ఇష్టపడిందట. వెంటనే ప్రభాకర్‌తో పరిచయం కావడం ప్రభాకర్ అంజుకి పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టడం జరిగిపోయింద‌ట.

క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా పరిచ‌యం ఉన్న న‌టుడే. మ‌న తెలుగు సినిమాల‌లో విల‌న్‌గా న‌టించాడు. అయితే అప్పటికే ప్రభాకర్ కు రెండు, మూడు పెళ్లిళ్లు అయ్యి పిల్లలు ఉన్నారన్న విషయం అంజుకు తెలియదట. ప్రభాకర్ కూడా ఈ విషయం కావాలని దాచిపెట్టి అంజును మోసం చేశాడట. తాను పెళ్ళికి రెడీగా లేనని చెప్పినా ప్రభాకర్ పదేపదే అంజు వెంటపడేవాడట. అప్పటికి ప్రభాకర్‌ వయసు 50ఏళ్లు. అంజు వయసు కేవలం 17 సంవత్సరాలు. అంజు తండ్రి కూడా ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు.

అయితే తల్లిదండ్రుల మాట వినకుండా ఇంట్లో నుంచి వచ్చేసి మరి ప్రభాకర్ ను పెళ్లి చేసుకుందట. ఇక కొద్ది నెలల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు ప్రభాకర్ తన పిల్లలను తీసుకువచ్చి అంజు కి చూపించాడట. అప్పటికి కానీ ప్రభాకర్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయన్న విషయం తెలియలేదట. అతడు చేసిన మోసంతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యాని.. బాగా డిప్రస్ అయ్యాను.. అయితే ఆ సమయంలో ప్రెగ్నెంట్ గా ఉండడంతో అతడితో ఉండలేక బయటకి వచ్చేసా అని తెలిపింది.

మొత్తం బంగారంతో పాటు ఆస్తులు అన్ని వదిలి ఇంటికి వచ్చేసానని.. మళ్లీ నీ ఇంటి గడప తొక్కను.. నువ్వు చచ్చినా నీ మొఖం కూడా చూడను అని ప్ర‌భాక‌ర్‌కు చెప్పి మ‌రీ వ‌చ్చేసింద‌ట‌. అందుకే ప్రభాకర్ చనిపోయినా తాను కనీసం చూడటానికి కూడా వెళ్లలేదని అంజు చెప్పింది. 17 ఏళ్ల వయసులో మోసపోయాక తాను ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని.. నెమ్మదిగా దాని నుంచి బయటకు వచ్చి ఇప్పటికీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నానని అంజు చెప్పింది.

ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో పైపై మెరుగులు.. తళుకులు చూసి మోసపోయే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. గుడ్డుగా నమ్మేసి ప్రేమలో పడిపోయి సర్వం అర్పించేసాక.. అంతా అయిపోయాక నిజం తెలుసుకుంటూ ఉంటారు అప్పుడు ఎంత బాధపడినా చేసేదేం ఉండదు. అందుకు అంజు జీవితమే పెద్ద ఉదాహరణ

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news