Moviesథ‌మ‌న్ చేసిన ప‌నికి మ‌హేష్‌కు మండిపోతోందా… ప‌క్క‌న పెట్టేయ‌మ‌ని త్రివిక్ర‌మ్‌కు వార్నింగ్...

థ‌మ‌న్ చేసిన ప‌నికి మ‌హేష్‌కు మండిపోతోందా… ప‌క్క‌న పెట్టేయ‌మ‌ని త్రివిక్ర‌మ్‌కు వార్నింగ్ ?

కారణం ఏదైనా ? థ‌మ‌న్‌ ఇటీవల కాలంలో బాగా బద్దకిస్తున్నట్టే కనిపిస్తోంది. దేవిశ్రీ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తమన్ రోడ్డ కొట్టుడు ట్యూన్ల‌తో బోర్ కొట్టించేసేవాడు. దేవిశ్రీ ఒక వైపు బ్లాక్ బస్టర్ పాటలతో దూసుకుపోతుంటే.. తమన్ కొట్టిందే కొట్టి.. వాయించిందే వాయించి పరమ బోరింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న ముద్ర వేసుకున్నాడు. చాలా తక్కువ టైంలోనే తమన్ 50 సినిమాలు పూర్తి చేశాడు. అప్పట్లో యేడాదికి పది నుంచి పదిహేను సినిమాలు కంపోజ్ చేసేవాడు.

దేవిశ్రీ ఇప్పుడైతే డౌన్ అయ్యాడో వెంటనే తమన్‌ ఫామ్ లోకి వచ్చేసాడు. స్టార్ హీరోలకు అదిరిపోయే ఆల్బమ్స్ ఇచ్చి టాలీవుడ్ లో తిరిగిలేని టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక కరోనా తర్వాత అఖండ అంతకుముందు అల‌వైకుంఠపురంలో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాల సక్సెస్ వెనక తమన్‌ మ్యూజిక్ ఎఫెక్ట్‌ ఎంతో ఉంది అన్నది వాస్తవం. ఇక ఇప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు.. టాప్ హీరోలు, దర్శకులు కూడా తమనే తమ సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలంటూ వెంటపడుతున్నారు.

అయితే తమన్‌లో కాస్త నిర్లక్ష్య ధోరణి ఎక్కువైందని తెలుస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్‌ టాపిక్ గా మారింది. ఎప్పుడైతే వరుసగా అవకాశాలు వస్తున్నాయో.. డిమాండ్ పెరిగిందో అందుకు తగ్గట్టుగా తమన్‌ కష్టపడటం లేదని తెలుస్తోంది. సరిలేరు నీకెవరు సినిమాకు దేవిశ్రీ బాగా దెబ్బయ్యడంతో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు తమన్‌కు అవకాశం ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో పాటలతోపాటు బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో బాగా దెబ్బేశాడు. దీంతో త్రివిక్రమ్ సినిమాకు తమన్‌ను పెట్టుకోవడం మహేష్‌కు ఇష్టం లేదట.

అయితే త్రివిక్రమ్ తన ఆస్థాన హీరోయిన్గా పూజ హెగ్డేను ఎలాగూ రిపీట్ చేశాడు.. అందుకే తమన్‌ను కూడా పట్టుబట్టి దుబాయ్ తీసుకువెళ్లి మహేష్ తో రాజీ చేయించి మరి ఈ ప్రాజెక్టుకు ఓకే చేయించాడు. ఈ సినిమా పనులు మొదలై ఆరు నెలలు అవుతుంది. అయితే తమన్ ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క ట్యూన్ కూడా ఇవ్వలేదట. ఓవైపు క్రికెట్ పోటీలకు.. అటు ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు తమన్ హాజరవుతున్న పరిస్థితి. అటువైపు నుంచి భారీగా రెమ్యూనరేషన్ అందుతోంది.

దీంతో మహేష్ సినిమాను పెద్దగా పట్టించుకోవడంలేదని.. టైం దగ్గర పడుతుంటే ఏదో ఒక ట్యూన్ చేసి ఇచ్చేసి చేతులు దులుపుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని మహేష్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తమన్ తీరుపట్ల మహేష్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. థ‌మ‌న్‌ను త‌ప్పించేయాల‌ని కూడా త్రివిక్ర‌మ్‌పై ఒత్తిడి చేస్తున్నాడ‌ట‌. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా తాను అనవసరంగా వీరిద్దరి మధ్య రాజీచేసి ఇరుక్కుపోయానే అని ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news