Moviesఎగిరి ఎగిరి పడుతున్న తమన్..తిక్క కుదిరే టైం వచ్చేసిందా..? కౌంట్ డౌన్...

ఎగిరి ఎగిరి పడుతున్న తమన్..తిక్క కుదిరే టైం వచ్చేసిందా..? కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓ సినిమా హిట్ అయింది అంటే స్టార్ హీరో హీరోయిన్ పేర్లు కాదు మ్యూజిక్ డైరెక్టర్ పేరు పాపులారిటీ చేస్తున్నారు జనాలు. అంతలా తన పేరుని జనాలోకి పోయే విధంగా మలుచుకున్నాడు తమన్. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రతి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసింది తమన్ నే కావడం గమనార్హం.

మరీ ముఖ్యంగా బాలయ్యతో అఖండ ..ఆ తర్వాత వీర సింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్న తమన్ పేరు సోషల్ మీడియాలో నెంబర్ వన్ రేంజ్ ట్రెండ్ అవుతుంది. అయితే రీసెంట్ కాలంలో మాత్రం తన కెరీర్ ని చిక్కుల్లో పెట్టే విధంగానే చేసుకుంటున్నాడు తమన్ అంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు . మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తూనే ఐడల్ సింగర్ సీజన్ 2 కి జడ్జ్ గా ఉన్నారు తమన్.

ఈ క్రమంలోనే రీసెంట్గా స్టార్ట్ అయిన షోలో ఎక్కువగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడని ..హద్దులు మీరు మరి మాట్లాడుతున్నాడు అన్న టాక్ వైరల్ గా మారింది. షోలో మరో జడ్జిలుగా ఉన్న గీతామాధురి, కార్తీక్ పై ఫన్నీ పంచెస్ వేయడం .. కంటెస్టెంట్ పై వల్గర్ డబల్ మీనింగ్ డైలాగ్స్ వేయడం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తమన్ బీహేవియర్ ఇలాగే కొనసాగితే తమన్ కెరియర్ స్పాయిల్ అవ్వడం పక్క అంటున్నారు జనాలు. ఓవర్ చేయకుండా మ్యూజిక్ పై కాన్సన్ట్రేషన్ చేసి జెన్యూన్ గా రివ్యూ ఇస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీలో తమన్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతాడని ..లేదంటే ఆయన కెరియర్ ఖతం అంటూ హెచ్చరిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news