MoviesRoja-Balayya రోజా - బాల‌య్య కాంబినేష‌న్లో ఎన్ని సినిమాలు… ఎన్ని హిట్లు…!

Roja-Balayya రోజా – బాల‌య్య కాంబినేష‌న్లో ఎన్ని సినిమాలు… ఎన్ని హిట్లు…!

నందమూరి బాలకృష్ణ, ఏపీ మంత్రి ఆర్కే రోజా కాంబినేషన్ అంటే సినిమా రంగంలో ఒక క్రేజ్. వీరిద్దరిది సినిమా రంగంలో మంచి హిట్ పేయిర్‌గా పేరు. వీరు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి కూడా ఇద్దరు ఒకేసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. బాలయ్య వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే.. రోజా కూడా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నారు. అలా వీరిద్దరూ సినిమా, రాజకీయ జీవితాన్ని సమాంతరంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఒకానొక టైం లో బాలయ్యను రోజాను వెండి తెర మీద చూసేందుకు రెండు కళ్ళు చాలవు. అంత గొప్ప కాంబినేషన్ గా వీరికి పేరు ఉంది. వీరిద్దరి కాంబినేషన్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి కిక్ గా ఉండేది.

వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం ఏడు సినిమాలు వచ్చాయి. 1994లో అయితే బాలయ్య వరుసగా మూడు సినిమాలలో రోజాను హీరోయిన్గా రిపీట్ చేశారు. అంతలా ఈ జంటకు క్రేజ్‌ ఉండేది. ఒక్కోసారి బాలయ్య- రోజా కాంబినేషన్లో ఏ సంవత్సరంలో ఎన్ని సినిమాలు వచ్చాయి ఏంటో తెలుసుకుందాం. తొలిసారిగా 1994లో వీరిద్దరూ భైరవద్వీపం సినిమాలో నటించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా జానపద కథాంశంతో తెరకెక్కింది. భైరవద్వీపం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రోజా యువరాణి పాత్రలో అద్భుతంగా మెప్పించింది.

ఆ వెంటనే మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన గాండీవం సినిమాలోని నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు. ఇక అదే ఏడాది కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి సింహం సినిమాలో బాలయ్య- రోజా నటించారు. ఈ సినిమాలో మీనా కూడా మరో హీరోయిన్గా నటించింది. బొబ్బిలి సింహం బాలయ్య కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.

ఆ మరుసటి ఏడాది 1995లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే మాతో పెట్టుకోకు సినిమా వచ్చింది. ఈ సినిమాలో రోజాతో పాటు రంభ‌ కూడా మరో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర విజయవంతం అయింది. ఇక 1996లో బాలయ్య పెద్ద రిస్క్ చేశారు. తనకు భైరవద్వీపం లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీకృష్ణార్జున విజయం సినిమాలో నటించారు. గతంలో ఎన్టీఆర్ నటించిన పౌరాణిక పాత్రలో బాలయ్య నటించిన.. అందరూ ఎన్టీఆర్ రేంజ్ లో ఊహించుకుని థియేటర్లోకి వెళ్లడంతో ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. ఈ సినిమాలోని రోజా నటించింది.

ఇక 1997లో శరత్ దర్శకత్వంలో పెద్దన్నయ్య సినిమా వచ్చింది. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా సక్సెస్ సాధించింది. బాలయ్య – రోజా కాంబినేషన్లో మరో హిట్ సినిమాగా రికార్డుల్లో నిలిచిపోయింది. ఇక రెండేళ్ల గ్యాప్ తర్వాత 1999లో భారీ అంచనాలతో సుల్తాన్ సినిమా వచ్చింది.. ఈ సినిమాలో రోజాతో పాటు రచన కూడా నటించారు. శరత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భారీ తారాగణంతో వచ్చిన సుల్తాన్ ప్రేక్షకుల అంచనాలను యావ‌రేజ్‌గా మాత్రమే అందుకుంది. అలా బాలయ్య – రోజా కాంబినేషన్ అంటే అప్పటికి… ఇప్పటికీ ఒక క్రేజీగా ఉండిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news