MoviesNagarjuna నాగార్జున విష‌యంలో పెద్ద త‌ప్పు చేసి బాధపడుతున్న స్టార్ డైరెక్టర్.....

Nagarjuna నాగార్జున విష‌యంలో పెద్ద త‌ప్పు చేసి బాధపడుతున్న స్టార్ డైరెక్టర్.. ఇప్ప‌ట‌కీ ఆ పాపం వెంటాడుతోందా…!

ఏ రంగంలో అయినా ప్రతి ఒక్కరు తప్పులు చేయటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే కొందరు తప్పులు చేసినప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటూ ఉంటారు. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా తన కెరీర్ లో చేసిన రెండు పెద్ద తప్పులతో భారీ మూల్యం చెల్లించుకున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎస్వి కృష్ణారెడ్డి 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఒకప్పుడు ఎస్ వి కృష్ణారెడ్డి అంటే తెలుగు ప్రేక్షకులను కుటుంబ కథ చిత్రాలతో మెప్పిస్తారన్న మంచి పేరు తెచ్చుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి కుటుంబ కథా చిత్రాలతో ఎన్నో అవార్డులు, రివార్డులు సంచలనాలు నమోదు చేశారు. 17 సంవత్సరాలుగా ఆయన దర్శకత్వ విభాగానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాతో తాను గ్రాండ్‌గా రీఎంట్రీ ఇస్తానన్న నమ్మకంతో ఉన్నారు.

ఈ సినిమా ప్రమోషన్లలో ఆయన తాను గతంలో చేసిన రెండు పెద్ద తప్పులను గురించి చెప్పారు. ఈ రెండు తప్పులు వల్లే తన కెరీర్ తలకిందులు అయిందని ఆయన వాపోయారు. సీనియర్ హీరో నాగార్జునతో ఎస్వీ కృష్ణారెడ్డి వజ్రం సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. అయితే వాస్తవంగా వజ్రం సినిమా కంటే.. ఆయన నాగార్జునకు మరో కథ చెప్పారట. నాగార్జున కూడా ఆ కథ‌తోనే సినిమా చేస్తానని హామీ కూడా ఇచ్చారట.

అయితే నిర్మాత నర్సారెడ్డి మాత్రం ఇందుకు ఒప్పుకోలేదట. సినిమాకు టేబుల్ ప్రాఫిట్ ఉంటే తప్ప తాను చేయనని చెప్పడంతో.. ఆయన కోసం నాగార్జున – ఎస్వీ కృష్ణారెడ్డి కథ మార్చుకోవాల్సి వచ్చిందట. తాను చేసిన అతిపెద్ద తప్పు ఇదే అని ఎస్వి కృష్ణారెడ్డి తాజాగా వాపోయారు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో.. తాను పెద్ద హీరోలను సరిగా డీల్ చేయలేనన్న పెద్ద రిమార్క్ తనపై పడిపోయిందని ఆయన బాధపడ్డారు. అలాగే తన కెరీర్లో చేసిన రెండో అతిపెద్ద తప్పు ఏంటంటే తాను హీరోగా మారటం అని కూడా చెప్పారు.

హీరోగా మారి చాలా పెద్ద తప్పు చేశానని.. కేవలం దర్శకత్వంపై కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే తన కెరీర్ మరో విధంగా ఉండేదని కృష్ణారెడ్డి బాధపడ్డారు. అలాగే ఎస్ వి. కృష్ణారెడ్డి బాలకృష్ణ – సౌందర్య జంటగా తెరకెక్కించిన టాప్ హీరో సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అప్పట్లో చిన్న హీరోలతో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన ఆయన పెద్ద హీరోలతో మాత్రం ప్లాప్ సినిమాలు ఇచ్చారు. అయితే సూపర్ స్టార్ కృష్ణకు తాను హిట్ సినిమాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఎవరు గుర్తించలేదని ఆయన వాపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news