Moviesఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని ఆమెకు ముందే తెలుసా..? ఇండస్ట్రీని షేక్...

ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని ఆమెకు ముందే తెలుసా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఓల్డ్ వీడియో..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రెసెంట్ ఆ క్రేజ్ ప్రపంచ దేశాలకు పాకింది . ఆయన లాస్ట్ గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది . అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకుని రీసెంట్ గానే సినీ జనాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు ని సైతం అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ పేర్లు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతున్నాయి.

కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న చరణ్ – తారక్. ప్రజెంట్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్నారు . కాగా ఆస్కార్ అవార్డుల వేడుక జరుగుతున్న టైంలో మన తెలుగు హీరోల గురించి అక్కడ ఎక్కువ డిస్కషన్స్ జరిగిందట . ఈ క్రమంలోనే నెట్ బేసిడ్ అనే డేటా విశ్లేషణ సంస్థ రిలీజ్ చేసిన సర్వేల ప్రకారంగా ఆస్కార్ వేడుక జరుగుతున్న టైం లో సోషల్ మీడియాలో , న్యూస్ మీడియాలో అందరికంటే ఎక్కువగా మెన్షన్ చేసిన పేర్లలో జూనియర్ ఎన్టీఆర్ ..ఫస్ట్ ప్లేస్ సాధించగా రాంచరణ్ రెండోస్థానాన్ని సంపాదించుకున్నాడు .

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన పేరు ని ట్రెండ్ చేస్తున్నారు. కాగా ఆస్కార్ అవార్డు ఈవెంట్ కు వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు తారక్. ఆస్కార్ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉందని.. ఇది కేవలం ఆర్ ఆర్ ఆర్ విజయం కాదు .. ప్రతి ఇండియన్ విజయం అని చెప్పుకొచ్చాడు.

కాగా ఇలాంటి క్రమంలోనే అప్పట్లోనే హీరోయిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించిన పాయల్ ఘోష్.. సినిమా ప్రమోషన్స్ లోనే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతారని అప్పట్లోనే చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే మరోసారి ఆ వీడియో ని ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఎన్టీఆర్ గొప్ప నటుడు ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది . కచ్చితంగా గ్లోబల్ స్టార్ అవుతాడు ఎన్టీఆర్ అంటూ అప్పట్లోనే చెప్పుకొచ్చింది. ఆ మాటలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news