MoviesBhoomika సరిగ్గా 20 ఏళ్ళ తరువాత.. ఆ స్టార్ హీరోతో జతకట్టబోతున్న...

Bhoomika సరిగ్గా 20 ఏళ్ళ తరువాత.. ఆ స్టార్ హీరోతో జతకట్టబోతున్న భూమిక..సూపరో సూపర్ అంతే.. !!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ లు.. సీనియర్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో పలు పాత్రలు పోషిస్తూ ..తమ కెరీర్ ను బిజీగా మల్చుకుంటున్నారు. కాగా ఇదే క్రమంలో ఒకప్పుడు అందాల ముద్దుగుమ్మగా పేరు సంపాదించుకున్న భూమిక .. మరోసారి సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటడానికి ట్రై చేస్తుంది . ఈ క్రమంలోనే బాలీవుడ్ లో టాలీవుడ్లో ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తూ క్రేజ్ ను దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది .

కాగా సరిగ్గా 20 ఏళ్ళ తరువాత భూమిక తన ఫేవరేట్ హీరో సినిమాలో నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత భూమిక టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో వెంకి నటిస్తున్న సినిమాలో నటించబోతుందట. మనకు తెలిసిందే గతంలో భూమిక – వెంకీ వాసు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా హిట్ కానప్పటికీ .. అభిమానులకు తెగ నచ్చేసింది. తెరపై వీళ్ళ జోడి సూపర్ అంటూ పోగిడేశారు. కాగా ఇన్నాళ్లకు మళ్ళీ వెంకటేష్ నటించిన సినిమాలో భూమిక కనిపించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే వీళ్ళు పక్క పక్కన నటించడం లేదట . సినిమాల్లో ఉండే రెండు వేరే వేరే క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ – పూజా హెగ్డే ..కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను సల్మాన్ కు బాగా సెంటిమెంట్ అయిన రంజాన్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈసినిమాలో టాలీవుడ్ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు నటించడం విశేషం. ఈ సినిమాలో భూమిక కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి వెంకీ – భూమిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . కచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి హీరో హీరోయిన్గా కూడా సినిమా చేయాలి అంటూ ఆశపడుతున్నారు. ఏది ఏమైన వీళ్లిద్దరు జతకడితే సూపరో సూపర్ అంటూ జనాలు ఇప్పటి నుంచి సినిమాకి హైప్ తీసుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news