MoviesNagaBabu నాగబాబు అంటే మెగా హీరోలకి ఇష్టం లేదా..? అంత చులకనగా...

NagaBabu నాగబాబు అంటే మెగా హీరోలకి ఇష్టం లేదా..? అంత చులకనగా చూస్తారా..?

మెగా ఫ్యామిలీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి ..ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత నాగబాబు గుర్తొచ్చేవాడు. మొదటి నుంచి ఎందుకో నాగబాబు పేరు చిరంజీవి – పవన్ కళ్యాణ్ కన్నా వెనకనే వినిపించేది . అంత పెద్ద స్టార్ హీరో కాలేకపోయాడు నాగబాబు . నటనలో మంచి టాలెంట్ ఉన్నా సరే నాగబాబును ఎందుకో జనాలు గుర్తించలేకపోయారు. కాగా తనదైన స్టైల్ లో ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో పలు కీలక పాత్రలు నటిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు.. రీసెంట్గా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

సంతోష్ శోభన్ , గౌరీ జి కిషన్ హీరో హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం “శ్రీదేవి శోభన్ బాబు” . ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సుష్మిత కొణిదెల , విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 18 గ్రాండ్గా థియేటర్ రిలీజ్ కానున్న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది . ఈ క్రమంలోనే నాగబాబు మాట్లాడుతూ..” మా ఇంట్లో చాలామంది హీరోలు ఉన్నారని …నాకు ఎవరు ఎప్పుడు చాన్స్ ఇవ్వలేదంటూ “చెప్పకొచ్చారు.

కానీ సుష్మిత మాత్రం పిలిచి నాకు ఆఫర్ ఇచ్చిందని.. సుస్మిత బంగారం అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు . అంతేకాదు ఆమె తీస్తున్న మరో వెబ్ సిరీస్ లో కూడా ఆయనకు ఆఫర్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు . దీంతో కొందరు మెగా హేటర్స్ కావాలనే నాగబాబు కామెంట్స్ ని వైరల్ చేస్తున్నారు. ” నీ ఫేస్ కి అంత సీన్ లేదు ..నీకు ఆఫర్ ఇచ్చిందే ఎక్కువ.. ఆమె బడ్జెట్ వేరే నటులు కి సరిపోలేక నువ్వు అయితే కరెక్ట్ అంటూ ఆమెను తీసుకుంది అంటూ …మరికొందరు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా హీరోలు నాగబాబుకి రెస్పెక్ట్ ఇవ్వరా..? ఆయన దగ్గర ఆస్తి లేదని అంత చులకన అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో నాగబాబు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే . పవన్ కళ్యాణ్ దగ్గరుండి ఆదుకొని నాగబాబును గట్టున పడేశారు . ప్రజెంట్ నాగబాబు తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఆరాకొర గౌరవం అందుకుంటున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news