Moviesఅన్ స్టాపబుల్ VS నిజం విత్ స్మిత.. బాలయ్యను తొక్కేసే దమ్ము...

అన్ స్టాపబుల్ VS నిజం విత్ స్మిత.. బాలయ్యను తొక్కేసే దమ్ము ఎవ్వడికైన ఉందా రా..?

ఒకప్పుడు టాక్ షోలు అంటే యమ బోరింగ్ గా ఉండేటివి . అదే బోరింగ్ కబుర్లు .. అదే హంగామా ..చెప్పిన మాటను పదేపదే చెప్పడం ..ఇదే కానీ ఇప్పుడు టాక్ షో అంటే ట్రెండ్ మారింది . నార్మల్ గా చేసే ఇంటర్వ్యూల కాకుండా సరికొత్తగా ప్రశ్నలు అడిగేలా హోస్ట్ లను రెడీ చేస్తున్నారు నిర్వాహకులు. కాగా ఈ మధ్యకాలంలో టాక్ షో లకు ప్రత్యేక ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ బాలయ్య .

ఓటిటి ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్నఅన్ స్టాపబుల్ సీజన్ టు స్ట్రీమింగ్ అవుతుంది . సీజన్ 1 హిట్ అవ్వడంతో సీజన్ 2 స్టార్ట్ చేసారు. సీజన్ కూడా అంతకుమించి డబల్ రేంజ్ లో హిట్ అయింది . మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , రెబల్ హీరో ప్రభాస్ ఎపిసోడ్ లు హైలెట్ గా నిలిచాయి. కాగా ఈ క్రమంలోనే మిగతా ఓటీటీ సంస్థలు కూడా టాక్ షోలను క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు .

అదే ఫార్మేట్ ని ఫాలో అవుతుంది డిస్ని హాట్ స్టార్. పాప్ సింగర్ స్మితతో నిజం విత్ స్మిత అంటూ ఓ సరి కొత్త టాక్ షో ని స్టార్ట్ చేసింది . ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి చిరంజీవి వచ్చి సందడి చేశారు . ఈ షో లో అభిమానులకు తెలియని ఎన్నో కొత్త విషయాల గురించి బయట పెట్టారు చిరంజీవి..ఈ ఎపిసోడ్కి మంచి ఆదరణ లభించింది . ఈ క్రమంలోనే తర్వాత చంద్రబాబు నాయుడు ..నాని ..రానా ..సాయి పల్లవి ..తమన్న ..సమంత ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు .

అయితే ఎంత ట్రై చేసినా సరే పాలయ్య లాగా అన్ స్టాపబుల్ షో తెచ్చుకున్న టిఆర్పి లాగా నిజం విత్ స్మిత రాదంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . స్మిత బాగానే చేస్తుంది కానీ నందమూరి హీరోలాగా ప్రశ్నలను ఉన్న విధంగా అడిగే ధైర్యం ఎవరికీ లేదని ..ఆయన మాటల్లోనే ఆ మ్యాజిక్ ఉంటుందని నందమూరిని తొక్కేసే విధంగా ఏ షో ఏ సినిమా చేయలేరంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అన్ స్టాపబుల్ VS నిజం విత్ స్మిత పోల్స్ నడుస్తున్నాయి. మరి మీకు ఏ షో నచ్చింది అన్ స్టాపబుల్ నా..? నిజం విత్ స్మిత నా..? కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news