Moviesపాన్ ఇండియా హీరోలకు పరువు తీసేసిన రామ్ పోతినేని.. యంగ్ హీరో...

పాన్ ఇండియా హీరోలకు పరువు తీసేసిన రామ్ పోతినేని.. యంగ్ హీరో అరుదైన రికార్డ్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోల పొజిషన్ ఏ విధంగా ఉందో తెలిసిందే. ప్రతి హీరో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తూ ఆ రేంజ్ లోనే పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు . కానీ లాభాలు అందుకోలేకపోతున్నారు. అయితే ఎవరు ఊహించిన విధంగా పాన్ ఇండియా హీరోలు మేము అని చెప్పుకుంటున్న హీరోలకు రామ్ పోతినేని దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాడు . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో మన హీరోలకు డిమాండ్ పెరిగింది . మన సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు . మన హీరోల సినిమాలు అక్కడ రిలీజ్ అయినా కాకపోయినా సినిమాలను డబ్బింగ్ అవ్వగానే యూట్యూబ్లో తెగ చూసేస్తున్నారు . ఈ క్రమంలోని రామ్ పోతినేని “హలో గురు ప్రేమకోసమే” హిందీ డబ్బింగ్ మూవీ ఏకంగా 500 మిలియన్ వ్యూయ సాధించిన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు రామ్ నటించిన సినిమాలలో ఇదే హైయెస్ట్ రికార్డ్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

రామ్ నటించిన అన్ని సినిమాల హిందీ వ్యూస్ రెండు బిలియన్ వ్యూయ్స్ ను సొంతం చేసుకున్నాయి . కాగా ఈ రకంగా బాలీవుడ్ లో రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు రామ్ పోతినేని . వరుస ఫెయిలర్స్ తో బాధపడుతున్నారు రామ్ పోతినేని కి ఇది శుభ వార్త అనే చెప్పాలి . అంతేకాదు మేము పాన్ ఇండియా హీరోలము అని చెప్పుకుంటున్న హీరోలు ..రామ్ రికార్డును చూసి నేర్చుకోవాలి అంటూ రామ్ పోతినేని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయి ఉన్నాడు . రామ్ లాస్ట్ గా హిట్టు అందుకున్న సినిమా ఇస్మార్ట్ శంకర్ . పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news