Moviesఅల్లు అర్జున్ - తారకరత్న విషయంలో అంత వార్ జరిగిందా..? ఎవ్వరికి...

అల్లు అర్జున్ – తారకరత్న విషయంలో అంత వార్ జరిగిందా..? ఎవ్వరికి తెలియని టాప్ సీక్రేట్..!!

టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. 23 రోజుల పాటు సుదీర్ఘంగా చావుతో పోరాడిన ఆయన ఓడిపోయి తుది శ్వాసను విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే నందమూరి తారకరత్నకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.

కాగా మనకు తెలిసిందే తారకరత్న మల్టీ టాలెంటెడ్.. ఎలాంటి రోల్స్నైనా సరే అవలీలగా నటిస్తాడు . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రాఘవేంద్రరావు 100వ చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్న టైంలో ఇండస్ట్రీలో టాప్ హీరోని ఇంట్రడ్యూస్ చేయాలని భావించారట. ఈ క్రమంలోని అల్లు అర్జున్ తన కొడుకుని లాంచ్ చేయమని ట్రై చేశారట. అదే టైంలో తారక రత్న తండ్రి నందమూరి మోహన్ కృష్ణ కూడా దర్శకేంద్రుడిని సంప్రదించి రిక్వెస్ట్ చేశారట .

అయితే ఇద్దరిలో ఒకరితోనే సినిమా చేయాలి కాబట్టి అప్పుడున్న సిచువేషన్ కారణంగా బన్నీని సెలెక్ట్ చేసుకున్నారట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఈ క్రమంలోని మోహన్ కృష్ణ ఏం హర్ట్ అవ్వకుండా తన బ్రదర్ బాలయ్యను సంప్రదించారట . బాలకృష్ణ కూడా ఇద్దరు డైరెక్టర్లు పేర్లు సజెస్ట్ చేసుకోమని సూచించగా .. బి గోపాల్, సింగీతం శ్రీనివాసరావు లలో ఒకరిని ఎంచుకోవాలని సూచించారు. కానీ ఆ ఇద్దరు దర్శకులు వివిధ కారణాలు చెప్పి నో అన్నారు. దీనితో తిరిగి రాఘవేంద్ర రావుని సలహా అడగగా కోదండరామిరెడ్డిని సూచించారు. అలా ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. కాగా బన్ని గంగోత్రి సినిమాతో ఎంత సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడో.. అంతకు డబల్ రేంజ్ లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా హిట్ అందుకున్నాడు తారకరత్న. ఏది ఏమైనా సరే తారకరత్న మన మధ్య లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోవడం అంత సులభమైన విషయం కాదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news