MoviesSurya-AlluArjun సూర్య చేయాల్సిన సూపర్ హిట్ సినిమా..అల్లు అర్జున్ దొబ్బేసాడు.. ఆ...

Surya-AlluArjun సూర్య చేయాల్సిన సూపర్ హిట్ సినిమా..అల్లు అర్జున్ దొబ్బేసాడు.. ఆ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరోతో చేయడం సర్వసాధారణం. కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం కారణం కావచ్చు.. కథ నచ్చకపోవడం కావచ్చు ..రీజన్ ఏదైనా సరే మనం చేయాల్సిన సినిమా మరో హీరో చేసి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయితే ఆ బాధ వర్ణాతితం . అలాంటి బాధలను మన టాలీవుడ్ స్టార్స్ ఎంతోమంది ఫేస్ చేసే ఉన్నారు. కాగా అలాంటి బాధను ఫేస్ చేసిన హీరో గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా చర్చ నడుస్తుంది .

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు . కెరియర్ లో ఎన్నో సినిమాలు చేసిన అల్లు అర్జున్ అభిమానులకి దగ్గర చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో తెరకెక్కిన “జులాయి” సినిమా అనే చెప్పాలి . ఈ సినిమాలో అందాలు ముద్దుగుమ్మ ఇలియానా హీరోయిన్గా నటించింది . తనికెళ్ల భరణి – రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది. ఏగంగ 50 కోట్ల క్లబ్ లోకి అల్లు అర్జున్ ఎంటర్ అయ్యేలా చేసింది .

ఈ సినిమాలో పాటలు ఇప్పటికి మనం మొబైల్ లో వింటూనే ఉంటాం . అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ కథను మొదట రాసుకునింది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కోసమట . ఇదే విషయాన్ని ఆయన కూడా చెప్పారట . కధ కూడా వివరించగా ఇంప్రెస్ అయిపోయిన సూర్య ప్రెసెంట్ కాల్ షీట్స్ లేవు కొన్నాళ్లు వెయిట్ చేయమన్నారట .

అయితే ఆత్రుత ఎక్కువ ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు వేరే హీరోస్ కోసం ట్రై చేయగా ఫైనల్లీ ఆ కథ అల్లు అర్జున్ చేతిలో పడింది . అల్లు అర్జున్ కి తొందర ఎక్కువే అందుకే సినిమాకి సైన్ చేయడం ..టకటక షూటింగ్ కంప్లీట్ చేయడం ..సినిమాని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోయాయి. ఇలా సూర్య బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను వదిలేసుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news