MoviesSharukh khan : అన్ బిలీవబుల్.. RRR రికార్డ్ ని తుక్కు...

Sharukh khan : అన్ బిలీవబుల్.. RRR రికార్డ్ ని తుక్కు తుక్కు చేసిన షారుఖ్ ఖాన్ పఠాన్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి పొజిషన్ నెలకొందో అందరికీ తెలిసిందే . ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ టాక్ సంపాదించుకుంటుందో ..ఎలాంటి రికార్డును బ్రేక్ చేస్తుందో ఎవరికి తెలియకుండా పోతుంది . భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సు మనిపించుకుంటున్నాయి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలన్నీ సంచలన రికార్డులను నెలకొల్పుతున్నాయి.. చరిత్రను తిరగరాస్తున్నాయి .

కాగా అలాంటి లిస్టులోకి యాడ్ అయిపోయింది షారుక్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన పఠాన్ సినిమా . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుందో . కాగా పడిపోతున్న బాలీవుడ్ మార్కెట్ ను ఒక్క సినిమాతో సింగల్ హ్యాండ్ తో పైకి లేపాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ . ఆయన రీసెంట్ గా నటించిన సినిమా పటాన్ . ఈ సినిమా మంచి విజయాన్ని బాక్సాఫీస్ వద్ద నమోదు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే .

సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు ..ట్రైలర్ లాంచ్ అప్పుడు ..ఈ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ నానా హంగామా చేశారు కొందరు ఆకతాయిలు .కాగా సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ మారిపోయింది . బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటివరకు పటాన్ సినిమా పూర్తిగా 850 కోట్లు క్రాస్ చేసిన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి . ఈ క్రమంలోనే పటాన్ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డ్ను బీట్ చేసింది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా యు.ఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద 14.9 మిలియన్ వసూలు చేసింది . కాగా ఈ రికార్డును బ్రేక్ చేస్తూ పటాన్ సినిమా ఏకంగా 14.95 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news