MoviesChiranjeevi-BhanuPriya చిరంజీవితో ఆ ఇష్యూ వల్లే భానుప్రియ కెరీర్ నాశనం అయ్యిందా..!

Chiranjeevi-BhanuPriya చిరంజీవితో ఆ ఇష్యూ వల్లే భానుప్రియ కెరీర్ నాశనం అయ్యిందా..!

భానుప్రియ చారడేసి కళ్ళు.. కావలసినంత అందంతో పాటు అభినయం ఆమె సొంతం. 1980 – 90వ దశకంలో అప్పట్లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న విజయశాంతి, రాధ లాంటి వాళ్లకు పోటీగా దూసుకు వచ్చిన భానుప్రియ కొన్నాళ్లపాటు తెలుగు,తమిళ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసిన మాట వాస్తవం. ఆమె చేసింది తక్కువ సినిమాలే ఆయన అప్పట్లో ఉన్న స్టార్ హీరోలు అందరితోనూ నటించి సూపర్ హిట్‌లు కొట్టింది. భానుప్రియ చేసినవి తక్కువ సినిమాలే. అయితే ఆమె ఆ తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

భానుప్రియ మంచి క్లాసిక్ డ్యాన్సర్. ఆమెకు ఆ రోజుల్లోనే భర్త నాట్యం, కూచిపూడి కొట్టినపిండి. ఆమెతో పోటీపడి డ్యాన్సులు చేసేందుకు మాస్టర్లే భయపడేవారు. అలాంటిది స్టార్ హీరోలు ఎందుకు మాత్రం భయపడరు అన్న టాక్ ఉండేది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా భానుప్రియ పక్కన‌ డ్యాన్స్ చేయాలంటే కాస్త బెరుకుగా ఉండేవారట. డాన్స్ మాస్టర్ ఒక స్టెప్పు చెప్పాడంటే ఎంత స్టార్ హీరో అయినా కాసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత సెట్ లోకి వచ్చేవాడట.

అయితే భానుప్రియ మాత్రం అలా చెప్పారో లేదో వెంటనే స్టెప్ వేసేందుకు రెడీ అయిపోయేవారట. అయితే ఇదే ఆమె పాలిట శాపం అయింది. మెగాస్టార్ చిరంజీవి లాంటి గొప్ప డ్యాన్సర్ కూడా భానుప్రియ తనను మించి మరి డ్యాన్స్ చేస్తుందన్న కారణంతో తనను ఎక్కడ‌ ? డామినేట్ చేస్తుందని ఆమెకు తన సినిమాలలో ఎక్కువగా ఛాన్సులు ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదని అప్పట్లో రూమర్లు గట్టిగా వినిపించాయి.

భానుప్రియ ఎంత పామ్‌లో ఉన్నా కూడా ఆమెతో కంటే ఎక్కువగా తన సినిమాలలో విజయశాంతి, రాధ‌ని హీరోయిన్‌గా పెట్టుకోవాలని దర్శ‌క నిర్మాతలపై ఒత్తిడి చేసే వార‌ని… అందుకే భానుప్రియ చిరంజీవి కాంబినేషన్లో విజయశాంతి, రాధ స్థాయిలో సినిమాలు రాలేదని అప్పటి సినిమా వర్గాల్లో ప్రచారం అయితే గట్టిగా వినిపించింది. ఎంతో టాలెంట్ ఉండి కూడా భానుప్రియ ఆమె స్థాయికి తగిన స్టార్ హీరోయిన్ కాలేకపోయిందని ఆమె అభిమానులు బాధపడుతూ ఉంటారు. దీనికి తోడు ఆమె ఎంతో నమ్మి పెళ్లి చేసుకున్న భర్త మోసం చేయడంతో పాటు ఆమె సన్నిహితులు, బంధువులు కూడా ఆర్థికంగా నమ్మించి మోసం చేయడంతో భానుప్రియ తీవ్రంగా కుంగిపోయింది.

చివరకు ఆమె ఇల్లు కూడా అమ్ముకోవాల్సి రావడంతో మద్రాస్‌లో ఏవీఎం స్టూడియో చెట్టియార్ తన స్టూడియోలో ఆమె ఉండేందుకు ఒక కాటేజ్ కూడా ఉచితంగా ఇచ్చారని అంటారు. ఏదేమైనా భానుప్రియ చాలా ఏళ్ల పాటు పొట్ట గడవనంత ఇబ్బందుల్లో ఉందని.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తున్నా ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రల‌లో నటిస్తేనే మంచి సక్సెస్ అవుతుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news