Moviesవిజ‌య్ వారీసు ( వార‌సుడు) రివ్యూ... వంశీ పైడిప‌ల్లి - విజ‌య్...

విజ‌య్ వారీసు ( వార‌సుడు) రివ్యూ… వంశీ పైడిప‌ల్లి – విజ‌య్ హిట్ ఇవ్వ‌లేదా…!

కోలీవుడ్ స్టార్ హీరో, ఇళ‌య దళపతి విజయ్ వారిసు సినిమా త‌మిళ్ వెర్ష‌న్ ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో బెనిఫిట్ షోలు ప‌డిపోయాయి. ఓవ‌ర్సీస్‌లో గ‌త రాత్రి ప్రీమియ‌ర్లు కంప్లీట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు నెటిజ‌న్ల నుంచి వ‌స్తోన్న టాక్ ప్ర‌కారం కథ రొటీన్‌గానే ఉంద‌ట‌. సినిమాకు మేజ‌ర్ ఎస్సెట్ థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం అంటున్నారు.

అఖండ రేంజ్‌లో థ‌మ‌న్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చేశాడ‌ట‌. ఇక ద‌ర్శ‌కుడు వంశీ పైడిపల్లి ఇలాంటి రొటీన్ క‌థ‌ల‌కే ప్రెష్ ట్రీట్‌మెంట్లు ఇవ్వ‌డంలో దిట్ట అని చెప్పేస్తున్నారు. విజ‌య్ ఫ్యాన్స్‌కు ఏది కావాలో అదే వ‌రీసులో తీసేశాడ‌ట‌. విజ‌య్‌ను ఎలా ? చూపించాలో అలాగే చూపించాడంటున్నారు. సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక చాలా నెగ‌ట‌విటి మూట‌క‌ట్టుకున్నా.. ఎన్నో ట్రోల్స్ వ‌చ్చినా వంశీ ట్రీట్‌మెంట్ మాత్రం కొత్త‌గా ఉంద‌నే అంటున్నారు.

Varisu second look: Vijay takes the rural route?

ఇక ఇదే రోజు అజిత్ తునివు ( తెలుగులో తెగింపు) సినిమా కూడా వ‌చ్చింది. అజిత్ సినిమాకు జ‌స్ట్ యావ‌రేజ్ టాక్ అని.. అదే త‌మ అభిమాన హీరో వ‌రీసుకు బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ అంటూ విజ‌య్ ఫ్యాన్స్ అప్పుడే సోష‌ల్ మీడియాలో హంగామా స్టార్ట్ చేసేశారు. విజ‌య్ పొడ్రా అని డైలాగ్ చెప్పాక వ‌చ్చే బీజీఎం, ఆ త‌ర్వాత ధీ ద‌ళ‌ప‌తి సాంగ్ అదిరిపోయాయ‌ట‌.

Varasudu Release Date: వార‌సుడు రిలీజ్ డేట్ ఫిక్స్ - చిరు బాల‌య్య‌ సినిమాల‌  త‌ర్వాతే వార‌సుడు - దిల్‌రాజు-varasudu release date vijay movie hit the  screens on this date

ఇక క్లైమాక్స్‌లో త‌ల్లి జ‌య‌సుధ‌తో ఉండే ఎపిసోడ్ సినిమాకే హైలెట్‌.. అలాగే సినిమా స్టోరీ సింపుల్‌గా ఉండ‌డం, చాలా తెలుగు సినిమాల‌ను క‌లిపి మిక్స్ చేసి తీసిన‌ట్టు ఉంద‌ని కూడా అంటున్నారు. సినిమాటోగ్ర‌ఫీ, ఆర్ ఆర్ బాగున్నా.. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, ర‌న్ టైం ఇబ్బంది పెడ‌తాయ‌ట‌.

Varasudu Business: తెలుగులో విజయ్ రికార్డు.. వారసుడు మూవీకి అన్ని కోట్లు..  దిల్ రాజు గట్టెక్కాలంటే! | Vijay Varasudu Movie Telugu Pre Release Business  Details - Telugu Filmibeat

అయితే సినిమా ఫ‌స్టాఫ్‌లో కాస్త ల్యాగ్ అయ్యింద‌ని.. సెకండాఫ్‌లో మాత్రం ఫుల్ ఎంట‌ర్టైన్‌మెంట్ అని కొంద‌రు అంటున్నారు. మ‌రి కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం మామూలుగానే మ‌న ఊహ‌కు అందే క‌థ‌, క‌థ‌నాలతో సినిమా న‌డుస్తుంద‌ని.. జ‌స్ట్ యావ‌రేజ్ అని అంటున్నారు. ఏదేమైనా ఓవ‌రాల్‌గా వ‌రీసుకు మ‌రీ అంత బ్లాక్‌బ‌స్ట‌ర్‌, అదిరిపోయింద‌న్న టాక్ లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news