Moviesక‌ళ్యాణ్‌రామ్ అమిగోస్ నుంచి టాప్ సీక్రెట్ లీక్‌... ' బింబిసార‌ '...

క‌ళ్యాణ్‌రామ్ అమిగోస్ నుంచి టాప్ సీక్రెట్ లీక్‌… ‘ బింబిసార‌ ‘ ను మించిన హిట్టే..!

నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో గ‌తేడాది టాలీవుడ్‌కు భారీ హిట్ ఇచ్చాడు. పైగా అదే రోజు సీతారామం లాంటి క్లాసిక‌ల్ హిట్ మూవీకి పోటీగా వ‌చ్చి కూడా మంచి హిట్ కొట్టాడు. దాదాపు ప‌టాస్‌, ఆ త‌ర్వాత 118 సినిమాలు మాత్ర‌మే గ‌త ప‌దేళ్ల‌లో క‌ళ్యాణ్‌కు హిట్లుగా నిలిచాయి. బింబిసార నిజంగా క‌ల్యాణ్ రామ్ కెరీర్ ఊపిరిలూదిన సినిమా. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో క‌ళ్యాణ్‌రామ్ మ‌రో నాలుగైదేళ్ల పాటు హ్యాపీగా సినిమాలు చేసుకోవ‌చ్చు.

క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ వ‌సూళ్లు సాధించిన సినిమాగా బింబిసార రికార్డుల‌కు ఎక్కేసింది. ఈ పాంట‌సీ డ్రామాకు సీక్వెల్ కూడా ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌శిష్ట్ ప్లాన్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. పైగా బింబిసార నంద‌మూరి ఫ్యాన్స్‌కు త్రిబుల్ ధ‌మాకా ఇచ్చింది. బాల‌య్య అఖండ‌, ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్ బింబిసార‌తో నంద‌మూరి త్రిబుల్ ధ‌మాకా ఇచ్చేశాడు.

ఇక ఇప్పుడు ఇదే ఊపులో అమిగోస్ సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మాణం.. కొత్త ద‌ర్శ‌కుడు రాజేంద్ర‌రెడ్డి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. అమిగోస్ ఫిబ్రవరి 10, 2023న రిలీజ్ కానుంది. ఇక న్యూ ఇయ‌ర్ కానుక‌గా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో క‌ళ్యాణ్‌రామ్ చాలా స్టైలీష్‌గా క‌నిపిస్తున్నాడు. సిద్దార్థ్ అనే పారిశ్రామిక వేత్త‌గా న‌టిస్తున్నాడు.

అమిగోస్ వ‌ర‌ల్డ్‌లోనే సిద్దార్థ్ డోపెల్‌గాంజ‌ర్ 1 అంటూ ఈ పోస్ట‌ర్‌లో మేక‌ర్స్ తెలియ‌జేశారు. ఇక సినిమా గురించి ఓ అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. బింబిసార‌లో క‌ళ్యాణ్‌రామ్ డ్యూయెల్ రోల్లో క‌నిపించాడు. ఇప్పుడు అమీగోస్‌లోనూ ఏకంగా త్రిబుల్ రోల్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ మూడు రోల్స్ కూడా చాలా కొత్త‌గా ఉంటాయ‌ని.. బింబిసార లాంటి ఫాంట‌సీ సినిమాతో మ‌న‌ల‌ను స‌రికొత్త ప్ర‌పంచంలోకి తీసుకువెళ్లిన క‌ళ్యాణ్‌రామ్ ఇప్పుడు ఈ సినిమాతో మ‌రో స‌రికొత్త వ‌ర‌ల్డ్‌లోకి తీసుకువెళ‌తాడ‌ని తెలుస్తోంది. ఏదేమైనా క‌ళ్యాణ్‌రామ్‌కు బింబిసార త‌ర్వాత మ‌రో హిట్ వ‌చ్చూ ఊపు క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news