MoviesNTR30: అప్డేట్ వచ్చిన ఆనందంగా లేని నందమూరి ఫ్యాన్స్..కారణం ఇదే..!!

NTR30: అప్డేట్ వచ్చిన ఆనందంగా లేని నందమూరి ఫ్యాన్స్..కారణం ఇదే..!!

కోట్లాదిమంది నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన ఎన్టీఆర్ థర్టీ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ని ఎట్టకేలకు రివీల్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ .. అప్పుడెప్పుడో ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ సినిమా ధియేటర్స్ లో కనిపించాడు, ఆ తర్వాత తన సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేయడమే మానేశారు . ఈ క్రమంలోనే మిగతా సినిమా హీరోలకి సంబంధించిన అప్డేట్స్ తో సోషల్ మీడియా మారుమ్రోగిపోతున్న టైంలో నందమూరి ఫ్యాన్స్ కు కడుపు మండి ..కొరటాల శివ పై దండయాత్ర చేశారు .

ఎన్టీఆర్ 30కి సంబంధించిన అప్డేట్ ని ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు . ఈ క్రమంలోనే న్యూ ఇయర్ సందర్భంగా కొరటాల ఎన్టీఆర్ 30 కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివిల్ చేశాడు . 2023 ఫిబ్రవరిలో ఎన్టీఆర్ థర్టీ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది అని తెలియజేశాడు . అంతేకాదు పనిలో పని రిలీజ్ డేట్ ని కూడా అందించాడు. 2024 ఏప్రిల్ 5న గ్రాండ్గా ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఎప్పటి నుంచి అభిమానులు ఆశగా ఎదురు చూసిన అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఎందుకో సంతోషంగా లేరు,

దానికి మెయిన్ రీజన్ కొరటాల ఇంత టైం టేకింగ్ తీసుకొని సినిమా రిలీజ్ చేయడమే అంటూ తెలుస్తుంది. 2023 ఫిబ్రవరిలో సినిమా స్టార్ట్ చేస్తే 2024 ఏప్రిల్ లో రిలీజ్ చేస్తాననడం అభిమానులకు షాకింగ్ అనిపిస్తుంది. అంటే దాదాపు మరో ఒకటిన్నర సంవత్సరం ఎన్టీఆర్ థియేటర్లోకి వచ్చే చాన్సే లేదు . ఈ క్రమంలోని రామ్ చరణ్ , పుష్ప2 మిగతా స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి . అయితే ఎన్టీఆర్ మాత్రం థియేటర్లో కనిపించబోడు . ఈ కారణంగానే ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఏది ఏమైనా సరే కొరటాల టైం ల్యాగ్ చేసే సినిమాను దొబ్బించేసాలా ఉన్నాడు అంటున్నారు కొందరు ఫ్యాన్స్. చూడాలి మరి ఏం జరగబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news