Moviesబిగ్‌బ్రేకింగ్‌: తెలుగులో వార‌సుడు వాయిదా... వీర‌సింహాకు ప్ల‌స్సేనా..?

బిగ్‌బ్రేకింగ్‌: తెలుగులో వార‌సుడు వాయిదా… వీర‌సింహాకు ప్ల‌స్సేనా..?

ఈ సంక్రాంతికి తెలుగులో ఇద్ద‌రు పెద్ద హీరోలు బాల‌య్య‌, చిరంజీవి ఇద్ద‌రు త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్నారు. బాల‌య్య వీర‌సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీర‌య్య సినిమాలు ఒక్క రోజు తేడాలో రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. మామూలుగా సంక్రాంతికి ఈ ఇద్ద‌రు హీరోలు పోటీప‌డుతున్నారు అంటే పోటీ ఈ ఇద్ద‌రి మ‌ధ్యే ఉంటుంది. అయితే టాలీవుడ్‌ను శాసించే దిల్ రాజు త‌న సొంత బ్యాన‌ర్లో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ హీరోగా వార‌సుడు సినిమా నిర్మించారు.

కోలీవుడ్‌లో వ‌రీసు పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాకు చాలా క్రేజీ అంశాలు హైలెట్‌గా ఉన్నాయి. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. మ‌న తెలుగోడు వంశీ పైడిప‌ల్లి డైరెక్ట‌ర్‌. ఇటు దిల్ రాజు నిర్మాణం, దిల్ రాజు డిస్ట్రిబ్యూష‌న్‌.. ఏపీ, నైజాంలో టాప్ థియేట‌ర్లు అన్నీ వార‌సుడికే వెళ్లిపోవ‌డం లాంటి అంశాల‌తో టాలీవుడ్ సంక్రాంతి పోటీ ట్రైయాంగిల్ అయిపోయింది.

ఇక ముందుగా వార‌సుడు సినిమాను వీర‌సింహారెడ్డి రిలీజ్ రోజునే జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ట్టు చెప్పారు. అయితే ఒక‌రోజు ముందుకు జ‌రిపి జ‌న‌వ‌రి 11న వార‌సుడు వేస్తున్నారు. దీంతో అంద‌రికి కాస్త రిలీఫ్ ఉంటుంద‌నే భావించారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం వార‌సుడు తెలుగులో అనుకున్న డేట్‌కు రిలీజ్ కావ‌ట్లేదంటున్నారు. టెక్నిక‌ల్‌గా తెలుగు వెర్ష‌న్ ప‌నులు కాస్త లేట్ కావ‌డంతో 12న వ‌స్తుంద‌ని అంటున్నారు.

ఈ టెక్నిక‌ల్ ప‌నులు ఇంకా లేట్ అయితే వార‌సుడు 13కు వెళ్లిపోయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే వీర‌సింహారెడ్డికి పెద్ద ప్ల‌స్ అవుతుంది. వీర‌య్య‌తో వార‌సుడు పోటీ ప‌డితే వీర‌య్య ఓపెనింగ్స్‌పై ఎంతో కొంత ఎఫెక్ట్ ఖ‌చ్చితంగా ప‌డుతుంది. ప్ర‌స్తుతానికి ఈ వార్త ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో బాగా హైలెట్‌గా మారుతోంది.

ఏదేమైనా ఇంత పోటీలో వార‌సుడు ఒక్క రోజు వాయిదా ప‌డినా అది పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుంది. ఇప్ప‌టికే వీర‌య్య‌, వీర‌సింహాకు ద‌క్క‌ని టాప్ థియేట‌ర్లు దిల్ రాజు వార‌సుడికి బ్లాక్ చేసి పెట్టారు. ఇలాంటి టైంలో ఇది బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఒక‌వేళ త‌మిళ‌నాడులో ఒక రోజు ముందుగా రిలీజ్ అయ్యి టాక్ తేడా వ‌స్తే వారసుడికి తెలుగులో మ‌రింత మైన‌స్ అవ్వ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news