Moviesస‌మ‌ర‌సింహారెడ్డి సెంటిమెంట్‌తో వీర‌సింహారెడ్డి... రికార్డులు ప‌గిలి పోవాల్సిందే..!

స‌మ‌ర‌సింహారెడ్డి సెంటిమెంట్‌తో వీర‌సింహారెడ్డి… రికార్డులు ప‌గిలి పోవాల్సిందే..!

న‌ట‌ర‌త్న నందమూరి బాలకృష్ణ న‌టించిన వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది సినీ అభిమానుల‌తో పాటు బాల‌య్య‌, నంద‌మూరి అభిమానుల్లో అయితే ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత బాల‌య్య చేస్తోన్న సినిమా కావ‌డం, ఇటు అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1, ఇప్పుడు 2 కూడా తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో ర‌చ్చ మామూలుగా లేదు.

పైగా సంక్రాంతికి చిరు, బాల‌య్య సినిమాల పోటీ సంగ్రామం… ఐదేళ్ల త‌ర్వాత మ‌రోసారి సంక్రాంతికి వీరిద్ద‌రు పోటీ ప‌డుతుండ‌డం, రెండు సినిమాలు ఒకే బ్యాన‌ర్లో తెర‌కెక్క‌డం, హీరోయిన్ కూడా ఒక్క‌ళ్లే కావ‌డంతో ఏ సినిమా పై చేయి సాధిస్తుంద‌న్న ఒక్క‌టే ఉత్కంఠ ఇండ‌స్ట్రీ అంత‌టా ఉంది. ఇప్ప‌టికే వీర‌సింహారెడ్డి నుంచి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ కూడా అదిరిపోయాయి.

ప్రి రిలీజ్ బిజినెస్ కూడా బాల‌య్య కెరీర్‌లోనే టాప్ రేంజ్‌లో జ‌రుగుతోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన పోస్ట‌ర్‌లో బాల‌య్య వైట్ అండ్ వైట్‌లో క‌నిపించాడు. చేతిలో పెద్ద ఇనుప సుత్తి (రాడ్‌) ప‌ట్టుకుని విల‌న్ల భ‌ర‌తం ప‌ట్టేందుకు వెళుతున్న‌ట్టుగా ఉన్నాడు. బాల‌య్య చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపిస్తున్నాడు. మామూలుగానే బాల‌య్య రౌద్ర ర‌సం ఎలా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే ఈ స్టిల్ ఆయ‌న సూప‌ర్ హిట్ సినిమా స‌మ‌ర‌సింహారెడ్డిలో ఐకానిక్ గొడ్డ‌లి పోస్ట‌ర్‌ను గుర్తు తెచ్చేలా ఉంది. స‌మ‌ర‌సింహారెడ్డి పోస్ట‌ర్‌లో బాల‌య్య గొడ్డ‌లి ప‌ట్టుకుని చాలా ఆవేశంగా విల‌న్ జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డిని చంపేందుకు వెళుతుంటాడు. ఇప్పుడు వీర‌సింహాలో ఈ ఇనుప‌రాడ్ స్టిల్ కూడా ఆ స్టిల్‌ను పోలి ఉండ‌డంతో ఈ సినిమా కూడా ఆ రేంజ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని బాల‌య్య అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక వీర‌సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవుతోంది. అదే రోజు విజ‌య్ వార‌సుడు వ‌స్తుండ‌గా.. మ‌రుస‌టి రోజే చిరంజీవి వాల్తేరు వీర‌య్య థియేట‌ర్ల‌లోకి దిగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news