Moviesఅద్దె గర్భం అంటూ ఎగతాళి..రఫాడించేసిన మెగా కోడలు పిల్ల..ఏం చేసిందో చూడండి..!!

అద్దె గర్భం అంటూ ఎగతాళి..రఫాడించేసిన మెగా కోడలు పిల్ల..ఏం చేసిందో చూడండి..!!

ప్రజెంట్ మెగా అభిమానులు గాల్లో తేలిపోతున్నారు . గత పదేళ్ళుగా ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన క్షణాన్ని ఉపాసన మెగా అభిమానులకు అందించింది. ఎస్ మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ . అందుతున్న సమాచారం ప్రకారం ఉపాసన ప్రజెంట్ ఐదవ నెలలో ఉంది . కాగా మెగాస్టార్ వన్ అండ్ ఓన్లీ సన్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్, సినీ స్టార్స్, చరణ్ ఫ్రెండ్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు .

ఈ క్రమంలోని మెగా కోడలు ఉపాసన పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అయితే కొందరు ఉపాసన అంటే గిట్టని వాళ్ళు ఆమె సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డను కనబోతుంది అంటూ ప్రచారం చేశారు . ఈ క్రమంలోనే అలాంటి వాళ్లకి ఘాటుగా కౌంటర్ ఇస్తూ రీసెంట్గా ఉపాసన తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది . ఓ ఫ్యామిలీ పార్టీ కోసం థాయిలాండ్ వెళ్లిన ఉపాసన జంట అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ఈ క్రమంలోనే ఫస్ట్ టైం బేబీ బంప్ తో కనిపించిన ఉపాసన ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు మెగా ఫాన్స్ . అంతేకాదు సరోగసి అంటూ తప్పుడు వార్తలు రాసిన వాళ్ళకి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది ఉపాసన అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే ఉపాసన బేబీ బంప్ లొ చాలా ముచ్చటగా ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడుతున్నారు . చూడాలి మరి రామ్ చరణ్ కి పాప పడుతుందో..? బాబు పుడతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news