Moviesశ్రీదేవి VS సుగుణసుందరి: ఏది హిట్..ఏది ఫట్..?

శ్రీదేవి VS సుగుణసుందరి: ఏది హిట్..ఏది ఫట్..?

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది . మనకు తెలిసిందే ఎప్పుడు లేని విధంగా ఇద్దరు బడా హీరోలు ఈ సంక్రాంతి రేసులో నువ్వా – నేనా అంటూ పోటీ పడుతున్నారు . టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాబి డైరెక్షన్లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్యతో జనవరి 13న థియేటర్స్ లో సందడి చేయనున్నారు, అదేవిధంగా నందమూరి నటసింహం బాలకృష్ణ మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మల్లి నేని డైరెక్షన్లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12న సంక్రాంతి కానుక గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . ఈ క్రమంలోని మెగా వ్శ్ నందమూరి వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మేకర్స్ సైతం రెండు సినిమాలకు పోటాపోటీగా ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అంటూ టైం చూసి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీర సింహారెడ్డి నుంచి ఫస్ట్ సింగిల్ జై బాలయ్య పాట హ్యూజ్ సక్సెస్ అందుకుంది . అదే వాల్తేరు వీరయ్య నుంచి బాస్ పార్టీ యావరేజ్ గా నిలిచింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తమన్ వ్శ్ దేవిశ్రీ ఫైట్ కూడా టఫ్ గా నడుస్తుంది . కాహా సెకండ్ సింగిల్ గా రీసెంట్ గా బాలయ్య – శృతిహాసన్ కి సంబంధించిన మాస్ రొమాంటిక్ సాంగ్ సుగుణసుందరి రిలీజ్ అయింది .

ఎవరు ఊహించిన విధంగా బాలయ్య ఈ సాంగ్లో లవర్ బాయ్ లుక్ లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. దీంతో అభిమానులకి ఈ పాట తెగ నచ్చేసింది. వాల్తేరు వీరయ్య నుంచి సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు . ఈ సాంగ్ కొందరు జనాలకు నచ్చుతున్న మరికొందరు జనాలకు అంతగా ఆకట్టుకోలేకపోతుంది. విడి విడి గా చూస్తే పాట బానే ఉన్న వీరసింహారెడ్డి లోని సుగుణసుందరి పాటతో కంపేర్ చేస్తే మాత్రం ఈ పాట యావరేజ్ ట్క్ కూడా దక్కించుకోవడం లేదు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ శ్రీదేవి పాటను ట్రోల్ చేస్తున్నారు . బాలయ్య సుగుణసుందరినే ది బెస్ట్ గా ఉందని శ్రీదేవి.. అంతగా ఆకట్టుకోలేదని చెప్తున్నారు . అంతేకాదు శ్రీదేవి సాంగ్లో చిరంజీవి శృతిహాసన్ స్టెప్స్ రొమాంటిక్ లుక్స్ కొరియోగ్రఫీ బాగున్నా.. బీట్ మెగా ఫాన్స్ కి పూనకాల తెప్పించలేకపోతుందని.. సుగుణసుందరి పాటలోని బీట్ తో కంపేర్ చేస్తే ఈ పాట సోషల్ మీడియాలో తేలిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే ఈ సినిమా రిలీజ్ అయ్యి అసలు టాక్ బయటకు వచ్చేవరకు సోషల్ మీడియాలో ఈ మెగా వ్స్ నందమూరి ఫ్యాన్స్ గోల కొనసాగుతూనే ఉంటుంది . మరి మీకు ఏ పాట నచ్చింది..? వాల్తేరు వీరయ్య లోని శ్రీదేవి సాంగ్ నా..? వీరసింహారెడ్డి లోని సుగుణసుందరి సాంగా నా..? మీ అభిప్రాయాని కామెంట్స్ లో తెలియజేయండి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news