Moviesశ్రీహన్ డబ్బు తీసుకోవడం కరెక్ట్ అంటారా..? ఓట్లు వేసిన జనాలు ఎర్రి...

శ్రీహన్ డబ్బు తీసుకోవడం కరెక్ట్ అంటారా..? ఓట్లు వేసిన జనాలు ఎర్రి పుష్పాలా..?

భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. అన్ని సీజన్స్ లోకి పరమ చెత్త టీఆర్పి రేటింగ్స్ దక్కించుకున్న బిగ్బాస్ సీజన్ 6 ఫైనల్ ఎపిసోడ్లో మరి దారుణంగా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే టాప్ ఫైవ్ లో రోహిత్ ,ఆదిరెడ్డి, కీర్తి, శ్రీహాన్, రేవంత్ నిలిచారు. కాగా అందరూ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ ఫైనల్ గా రేవంత్ – శ్రీహన్ టాప్ టు పొజిషన్లో ఉండగా ..ఎవరు ఊహించిన విధంగా బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్కు టెంప్ట్ అయిపోయి 40 లక్షలు అందుకున్నాడు శ్రీహాన్.

ఈ క్రమంలోనే ఓట్లు ఎక్కువ వచ్చిన సరే ఆయన విన్నర్ గా తన పేరు నమోదు చేసుకోలేకపోయాడు . అంతేకాదు ఓట్లు తక్కువ వచ్చిన సింగర్ రేవంత్ బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ గా ఎంపికయ్యాడు. అంతే కాదు పది లక్షల క్యాష్ , సువర్ణభూమి నుంచి గిఫ్ట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫైనల్ ఎపిసోడ్ గురించి జనాలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. శ్రీహాన్ ని నమ్మి కోట్లాదిమంది జనాలు ఓట్లు వేస్తే ..ఆయన డబ్బు కోసం ఇలా ఆఫర్ ను పుచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు .

సింగర్ రేవంత్ మొదటి నుంచి ఒకటే మాట మీద నిలబడుతున్నాడని ..టైటిల్ విన్నర్ అవ్వాలని గట్టిగా భీష్ముంచుకుని కూర్చున్నాడని ..అదే విధంగా ఆయన టైటిల్ కొట్టాడని ..మరి శ్రీహాన్ ని నమ్మి ఓట్లు వేసిన జనాలు పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కొందరు హద్దులు మీరి శ్రీహాన్ కి ఓట్లు వేసిన న వారందరు ఎర్రి పుష్పాల ..కష్టపడి అందరిని బతిమిలాడుకొని ఓట్లు వేయిస్తే శ్రీహన్ లాస్ట్ మూమెంట్లో ఇలా హ్యాండ్ ఇచ్చి డబ్బు కోసం అందరికీ పంగనామం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీహన్ వ్స్ రేవంత్ బిగ్ బాస్ ట్రోఫీ చర్చనీయాంశంగా మారింది. మరి మీరేమంటారు శ్రీహన్ డబ్బులు తీసుకోవడం కరెక్ట్ అంటారా ..? మరి ఓట్లేసిన జనాలు పరిస్థితి ఏంటి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news