Moviesకెమారా వెనుక అలా చేస్తే కోట్లు..బాలీవుడ్ గుట్టుని రట్టు చేసిన తాప్సీ..!?

కెమారా వెనుక అలా చేస్తే కోట్లు..బాలీవుడ్ గుట్టుని రట్టు చేసిన తాప్సీ..!?

సినిమా ఇండస్ట్రీలో నటించడం చాలా కామన్. నటిస్తేనే వాళ్ళ కెరియర్ బాగుంటుంది. అయితే కెమెరా ముందు నటించడం వేరు. కెమెరా వెనక నటించడం వేరు . కెమెరా ముందు నటిస్తే మహానటి అంటారు ..కెమెరా వెనక నటిస్తే టక్కులాడి అంటారు . ఇలాంటి రంగులు మార్చే ఊసరవెల్లి గుణం ఉన్న సినీ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ధైర్యం చేసి మాట్లాడలేదు . మాట్లాడితే అలాంటి హీరోయిన్ ని తొక్కేస్తారు . ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడే హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో చాలా తక్కువ .

 

అయితే వాళ్లలో మొదటి స్థానంలో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ తాప్సి. ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి.. బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు, బోల్డ్ కంటెంట్ సినిమాలు చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్న తాప్సి రీసెంట్గా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి .

ఆమె మాట్లాడుతూ..” కెమెరా ముందు మాత్రమే నటించగలను.. తెర వెనక కూడా నటించడం నాకు రాదు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం నా అలవాటు. అఫ్ కోర్స్ అలా వెనక నటించిన వాళ్లే ఇండస్ట్రీలో ముందు వరుసలో ఉంటారు ” అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తాప్సి టాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్గా తనతో పాటు బాలీవుడ్ కి చెక్ చేసిన ముద్దుగుమ్మ గురించే ఇలాంటి కామెంట్స్ చేసింది అని తెలుస్తుంది .

మనకు తెలిసిందే స్టార్ ఓ హీరోయిన్ ఇక్కడ బడా హీరోలతో నటించి ప్రజెంట్ బాలీవుడ్ లో చక్రం తిప్పేస్తుంది . మరీ ముఖ్యంగా స్టార్ హీరో సినిమాలో పదే పదే కనిపిస్తుంది . అక్కడి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ హీరోయిన్ ని స్టార్ హీరో ఉంచుకున్నాడు అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోని తాప్సి కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది .ఏది ఏమైనా సరే తాప్సి మాటలు మరోసారి ఆమె పేరుని సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యే విధంగా చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news