Moviesసిగ్గు పడితే సంపాదించుకోలేం..మొహమాట పడితే ముందుకెళ్లలేం..మృణాల్ చెప్పిన నీతి పాఠాలు..!!

సిగ్గు పడితే సంపాదించుకోలేం..మొహమాట పడితే ముందుకెళ్లలేం..మృణాల్ చెప్పిన నీతి పాఠాలు..!!

అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఎంత అందంగా ఉంటుందో అంతకన్నా ఘాటుగా మాట్లాడుతుంది . సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..చేసిన సినిమాలు చాలా తక్కువ . అందులో హిట్ కొట్టింది మరిన్ని తక్కువ.. కానీ చేసిన ప్రతిపాత్రలో తనకంటూ స్పెషల్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ మృణాల్ రీసెంట్గా సీతారాం సినిమాలో సీత పాత్రలో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

ఇంకా పక్కాగా చెప్పాలంటే ఇంతవరకు తను నటించిన సినిమాలు ఒక ఎత్తు ..ఇకపై నటించే సినిమాలు ఓకే ఎత్తు అనే విధంగా ఈ సినిమా ఆమె కెరియర్ని మార్చేసింది. ఇంతవరకు ఆమె ఎక్స్పోజింగ్ చేస్తే సెక్సీ అనేవారు..ఇప్పుడు ఆమె అలా చేస్తే చూడలేమంటున్నారు.. అంతలా ఆ పాత్రతో జనాల మదిలోకి వెళ్లిపోయింది . కాగా రీసెంట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయిన మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా ఉండాలో చెప్పి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది .

ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మృణాల్ చేసిన డేరింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఆమె మాట్లాడుతూ..”హీరోయిన్స్ విషయంలో అస్సలు మొహమాట పడకూడదు . అలా ఉంటే మనం డబ్బులు వెనకేసుకోలేం. వాళ్లకు కావాల్సిన విధంగా మనల్ని మార్చుకుంటున్నప్పుడు ..మనకు కావాల్సిన విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం మన హక్కు ..మీకు ఎంత కావాలో అడగండి..డిమాండ్ చేయండి ..మీ మార్కెట్ బట్టి వాళ్ళు మీకు ఎంత ఇవ్వాలో ఇస్తారు . మరీ ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో మొహమాట పడితే హీరోయిన్స్ ఎప్పటికీ పైకి ఎదగలేరని”.. ఉన్నది ఉన్నట్టు మోహానే చెప్పేసింది . యస్ ఆమె చెప్పింది నిజం అంటూ కొందరు అంటుంటే మరి కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే మృణాల్ ఠాగూర్ డేరింగ్ ఆడపిల్ల అంటూ మరోసారి ప్రూవ్ చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news