Moviesహవ్వా..అర్థరాత్రి శ్రీహాన్‌ దుప్పట్లో దూరిన శ్రీ సత్య..ఏం చేసిందో తెలుసా..?

హవ్వా..అర్థరాత్రి శ్రీహాన్‌ దుప్పట్లో దూరిన శ్రీ సత్య..ఏం చేసిందో తెలుసా..?

మరి కొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు . అయితే హౌస్ లో మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ రావు అనుకున్న సందర్భంలో అర్థ రాత్రి నిద్ర మేలుకొని సైతం ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ కంటెస్టెంట్లను ఆట పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి హౌస్ లో జరిగిన ఎపిసోడ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. రాత్రి సమయంలో బిగ్ బాస్ హౌస్ లో బ్యూటిఫుల్ అందగత్తె శ్రీ సత్య తనకు సంబంధించి.. గతంలో జరిగిన ఇన్సిడెంట్ ను రీ క్రియేట్ చేస్తూ ఇంటి సభ్యులకు గుర్తు చేస్తూ ఫన్నీ వాతావరణన్ని క్రియేట్ చేసింది .

రాత్రి రెండు గంటల సమయంలో ఓ ఫ్రెండ్ నిద్రలో లేచి నడుస్తున్నాడని చెప్పిన శ్రీ సత్య ..ఈ క్రమంలోనే గట్టిగా అరిచిన శబ్దం కూడా వచ్చిందని గుర్తు చేసుకుంది. దీంతో అందరు ఒక్కసారిగా భయపడ్డారు . అంతేకాదు ఈ క్రమంలోనే శ్రీ సత్య వెళ్లి శ్రీహన్ పడుకుని ఉన్న దుప్పట్లో దూరేసింది . దీంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు కంటెస్టెంట్స్. బిగ్ బాస్ చూస్తున్న జనాలు సైతం దుప్పట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేని విధంగా ఉండిపోవడంతో లోపల ఏదో జరుగుతుందని ఫిక్స్ అయిపోయారు .

అయితే ఈ క్రమంలోని భయభ్రాంతులకు గురైన శ్రీహాన్ టక్కున ఒక్కసారిగా శబ్దం రావడంతో రచ్చ రచ్చ చేశాడు . ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే చాలా ధైర్యంగా ఉండే శ్రీహాన్ ఒక్కసారిగా భయపడుతున్నట్లు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ..అది యాక్టింగ్ గా..? నిజంగానే భయపడ్డాడా..? అన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలింది . అంతేకాదు ఇనయా కాసేపు దయ్యం పట్టినట్టు వ్యవహరించింది. అంతేకాదు బెడ్ పై పడుకొని అరుపులు, కేకలతో, దొర్లుతూ కొంసేపు హంగామా చేసింది. ఇవన్నీ నవ్వులు పూయించిన శ్రీ సత్య- శ్రీహాన్ దుప్పట్లో దూరింది మాత్రం ప్రజలు హైలెట్ చేస్తున్నారు . సిరిని ట్యాగ్ చేస్తూ దుప్పట్లో ఏం చేశారో ఇంటికి వచ్చాక అడుగు శ్రీహాన్ ని అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . శ్రీ సత్య ఈసారి కూడా సేవ్ అవ్వడానికి ఇలాంటి పనులు చేస్తుంది అంటూ జనాలు ఆమెపై మండిపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news