Moviesనాలిక మడత పెట్టి ఇరగదీసిన నటి ప్రగతి..దాని పై ఎక్కి మరీ...

నాలిక మడత పెట్టి ఇరగదీసిన నటి ప్రగతి..దాని పై ఎక్కి మరీ రచ్చ రంబోలా.. వీడియో వైరల్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. చేతికి అంది వచ్చిన పాత్రలు తనదైన స్టైల్ లో నటిస్తుంది. హీరోయిన్ గా సెటిల్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ప్రగతికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి . ఈ క్రమంలోనే ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిలైంది .

హీరో, హీరోయిన్లు తల్లి పాత్రలో.. పక్కింటి ఆంటీ పాత్రలో మెరిసే ప్రగతి లాక్ డౌన్ నుండి సోషల్ మీడియాలో యాక్టివ్గా మారింది . ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేసే ప్రగతి రీసెంట్గా తన సిస్టర్ హల్దీ ఫంక్షన్లో చేసిన రచ్చ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది . పసుపు ఫంక్షన్ లో పర్ఫామెన్స్ ఇరగదీస్తూ డోలు వాయిస్తూ యాక్టర్స్ ప్రగతి రచ్చ రచ్చ చేసింది .

దీంతో ప్రగతి ఈ రేంజ్ లో కూడా డాన్స్ చేయడం పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది. అంతేకాదు కొంచెం వయసుని గుర్తు చేసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు . దీంతో సిస్టర్ పెళ్లిలో ప్రగతి చేసిన హంగామా వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే నాలుక మడత పెట్టి ఊర మాస్ యాంగిల్స్ లో ప్రగతి ఇరగదీసింది అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news