Moviesబాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో నుంచి ప్ర‌భాస్ రొమాంటిక్ ఫోన్ కాల్‌కు షాక్...

బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షో నుంచి ప్ర‌భాస్ రొమాంటిక్ ఫోన్ కాల్‌కు షాక్ అయిన స్టార్ హీరోయిన్‌…!

నట‌సింహ బాలకృష్ణ అనాస్టాప‌బుల్ టాక్ షో బుల్లితెరను షేక్ చేసి పడేస్తుంది. ఈ టాక్ షో దెబ్బతో ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కడికో వెళ్లిపోయింది. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ తెలుగు ఎంటర్టైన్మెంట్, రాజకీయ రంగాల్లో పెద్ద సంచలనం రేపింది. ఈ ఎపిసోడ్ కు బాలయ్య బావ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, బాలయ్య అల్లుడు.. మాజీమంత్రి నారా లోకేష్ ఇద్దరు వచ్చి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ తర్వాత యంగ్ హీరోలతో బాలయ్య నడిపించిన రెండు, మూడు ఎపిసోడ్ లు కూడా బాగా పేలాయి.

కిరణ్ కుమార్ రెడ్డి – రాధిక – సురేష్ రెడ్డితో బాలయ్య చేసిన నాలుగో ఎపిసోడ్ కు అనుకున్నంత రెస్పాన్స్ రాకపోయినా.. కోదండరామిరెడ్డి – రాఘవేంద్రరావు – అల్లు అరవింద్ – సురేష్ బాబుతో బాలయ్య చేసిన 5వ‌ ఎపిసోడ్ అద్భుతంగా పేలిపోయింది. ఇక ఆరో ఎపిసోడ్ కు ఎవ్వరూ ఊహించిన విధంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు మ్యాచోస్టార్ గోపీచంద్ గెస్టులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.

ప్రభాస్‌కు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే క్రేజ్ ఉంది. ప్రభాస్ తో పాటు బెస్ట్ ఫ్రెండ్ గోపిచంద్ ఇద్దరిని కలిపి బాలయ్య ఎలా ? ఆడుకున్నాడు అన్నదానికోసం సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా జనవరి 31వ తేదీ అర్ధరాత్రి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

అయితే ఈ షోలో ప్ర‌భాస్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు కాల్ చేస్తాడ‌ట‌. అక్క‌డ ప్ర‌భాస్‌, బాల‌య్య క‌లిసి చ‌ర‌ణ్‌తో ముచ్చ‌ట్లు పెడ‌తార‌ట‌. అలాగే మ‌రో స్టార్ హీరోయిన్ శృతీహాస‌న్‌కు కూడా బాల‌య్య ఫోన్ క‌లిపి ఇస్తే ప్ర‌భాస్ రొమాంటిక్ డైలాగుల‌తో శృతిని ఆట‌ప‌ట్టించాడ‌ని తెలుస్తోంది. శృతిని అటు ప్ర‌భాస్‌తో పాటు ఇటు బాల‌య్య క‌లిసి శృతిని ఆటాడుకున్నార‌ట‌. ఇది ఎపిసోడ్‌కే హైలెట్ అంటున్నారు.

ఇక శృతి ప్ర‌స్తుతం బాల‌య్య‌తో వీర‌సింహారెడ్డి సినిమాలోనూ, అటు ప్ర‌భాస్‌తో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న స‌లార్ సినిమాలోనూ న‌టిస్తోంది. అందుకే ఇప్పుడు త‌మ కామ‌న్ హీరోయిన్‌కు వీరు ఫోన్ చేసి స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news