Moviesఆ స్టార్ డైరెక్టర్ మోహన్ బాబు పేరు చెబితే గజగజా వణికేవాడా......

ఆ స్టార్ డైరెక్టర్ మోహన్ బాబు పేరు చెబితే గజగజా వణికేవాడా… ఈ భ‌యానికి కార‌ణం..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు యమదొంగ సినిమా వరకు సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించారు. అయితే మంచు ఫ్యామిలీపై ఈ మధ్య కాలంలో వేర్వేరు రీజన్ల వల్ల ప్రేక్షకుల్లో నెగిటివిటీ వచ్చింది. మంచు ఫ్యామిలీ సినిమాలు యావరేజ్ రివ్యూలను సొంతం చేసుకుంటున్నా కొత్త హీరోల సినిమాల కంటే దారుణంగా కలెక్షన్లను సాధిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కడంతో పాటు ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం కోటిన్నర రూపాయల కంటే తక్కువ మొత్తం కలెక్షన్లను సాధించి మంచు విష్ణు తర్వాత ప్రాజెక్ట్ ల బిజినెస్ పై ప్రభావం చూపింది. మోహ‌న్‌బాబు స‌న్నాఫ్ ఇండియా ఎంత పెద్ద డిజాస్ట‌ర్ అయ్యిందో… ఈ సినిమా దెబ్బ‌తో మోహ‌న్‌బాబుకు ఎంత పెద్ద అవ‌మానం మిగిలిందో చూశాం.

మోహన్ బాబును చూస్తే ఇండస్ట్రీలో చాలామంది భయపడతారనే సంగతి తెలిసిందే. మోహన్ బాబు పేరు వింటే స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు కూడా భయపడతారట‌. మోహన్ బాబు రాఘవేంద్ర రావు కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఏ టైమ్ చెబితే ఆ టైమ్ కు షూటింగ్ అనుకున్న విధంగా జరగాలి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఈ విధంగా జరగడం సాధ్యం కాకపోతే మోహన్ బాబు అరిచేవారు కాబట్టి రాఘవేంద్ర రావు భయపడేవార‌ట‌.

టైమ్ ప్రకారం షూట్ జరగని పక్షంలో నా పనులు ఆలస్యమవుతాయని మోహన్ బాబు తిట్టేవారని ఆ కారణం వల్లే ఇతర హీరోలతో కూల్ గా పని చేసే రాఘవేంద్ర రావు మోహన్ బాబుతో పని చేసే సమయంలో మాత్రం టెన్షన్ పడేవారని సమాచారం. మరోవైపు మోహన్ బాబు సరైన స్క్రిప్ట్ లను ఎంచుకుని బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే ఆయనపై విమర్శలు ఆగిపోతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. క్రేజీ ప్రాజెక్ట్ లను, పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ఎంచుకుని మోహన్ బాబు నటుడిగా బిజీ కావాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news