Moviesనాటి గ్లామర్ క్వీన్ శోభన ఆ కార‌ణంతోనే రీ ఎంట్రీ ఇవ్వ‌ట్లేదా...!

నాటి గ్లామర్ క్వీన్ శోభన ఆ కార‌ణంతోనే రీ ఎంట్రీ ఇవ్వ‌ట్లేదా…!

శోభన..తెలుగు చిత్ర పరిశ్రమలో గ్లామర్ కీన్‌గానూ, ఫ్యామిలీ హీరోయిన్‌గానూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. సాధారణంగా ఇలాంటి హైలీ టాలెంటెడ్ పర్ఫార్మర్ కొన్ని వందల సినిమాలలో హీరోయిన్‌గా నటించాలి. కానీ, ఎందుకనో శోభన అందులో పదవ వంతు కూడా చేయలేకపోయింది. దీనికి కారణం తను భరత నాట్య కళాకారిణి కావడమే.

కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చిన శోభన.. సినిమాలు మాత్రం అతితక్కువ చేసింది. కమర్షియల్ హీరోయిన్‌గా నిలబడాలంటే మితిమీరిన ఎక్స్‌ఫోజింగ్ చేయాలి. కానీ, శోభన మాత్రం దీనిలో చాలా వెనకబడింది. తన తరంలో విజయశాంతి, దివ్య భారతి, రంభ, సౌందర్య లాంటి హీరోయిన్స్ ఓ వెలుగు వెలిగారు. శోభన, దివ్య భారతి కలిసి నటించిన రౌడీ అల్లుడు ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిదో అందరికీ తెలిసిందే.

మోహన్ బాబు సరసన నటించిన రౌడీ గారి పెళ్ళాం, అల్లుడుగారు కూడా భారీ హిట్. అంతేకాదు, తెలుగులో శోభన నటించిన సినిమాలు చాలా తక్కువే అయినా వాటులో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. అయితే, ఒక దశ తర్వాత శోభన సిల్వర్ స్క్రీన్‌కి దూరమయ్యారు. చాలామంది హీరోయిన్స్ మాదిరిగా రీ ఎంట్రీ ఇవడానికి ఇష్టపడలేదు. దీనికి కారణం శోభన ఏజ్ ఒకటైతే, రెండవది నాట్య కళాకారిగా కొనసాగుతుండటమే.

రీ ఎంట్రీ ఇవ్వాలంటే త్రివిక్రమ్‌ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి దర్శకులు అవకాశాలివ్వాలి. ఇచ్చినా శోభన ఒప్పుకోవాలి. కానీ, అమ్మ, అత్త పాత్రలు చేయడం ఇష్టం లేకనే అని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. నిజంగా శోభన లాంటి గొప్ప నటి ఇప్పుడు తెరమీద కనిపిస్తే చాలామందికి ఆమె నటించిన సినిమాలన్నీ అలా కళ్ళముందు కదులుతాయి. మరి ఆ కోరిక నెరవేరేనా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news