Moviesడిసెంబర్ లో ఎంగేజ్మెంట్..ఫిబ్రవరి లో పెళ్లి.. ఫైనల్లీ పెళ్ళికొడుకు అయిన ప్రదీప్.....

డిసెంబర్ లో ఎంగేజ్మెంట్..ఫిబ్రవరి లో పెళ్లి.. ఫైనల్లీ పెళ్ళికొడుకు అయిన ప్రదీప్.. అమ్మాయి ఎవరి తెలిస్తే షాక్ అయిపోతారు..!!

బుల్లి తెర పై యాంకర్ ప్రదీప్ కి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫిమేల్ యాంకర్స్ లో సుమ ఎంత స్టార్ పొజిషన్లో ఉందో మేల్ యాంకర్లో ప్రదీప్ అంతటి పొజిషన్లో ఉన్నాడు . ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్నా సరే ..ఇప్పటికీ తన స్టైల్ ని మార్చకుండా ఒకే జోనర్లో యాంకరింగ్ చేస్తూ పద్ధతి గల యాంకర్ అంటూ ట్యాగ్ చేయించుకున్నాడు .

తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రభాస్ . అయితే అదే విధంగా బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రదీప్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది అభిమానుల కోరిక.. కొన్ని సంవత్సరాలుగా ఆయన పెళ్లి ఇదిగో అమ్మాయి రేపే ఆయన ముహూర్తం అంటూ వార్తలు వినిపిస్తున్న ఇప్పటివరకు పెళ్లిపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన అయితే ప్రదీప్ చేయలేదు .

సోషల్ మీడియాలో గత 24 గంటల నుంచి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అంతేకాదు డిసెంబర్ 26న చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు ఫ్యాషన్ డిజైనర్ నవ్య . ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పలువురు స్టార్ సెలబ్రిటీస్ కి డిజైనర్ గా వర్క్ చేస్తుంది. వీళ్లిద్దరు చాలా రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నారని..వీళ్ల ప్రేమ పెళ్లి వరకు వెళ్లిందని జనాలు చెప్పుకుంటున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇద్దరి మతాలు వేరు అయినప్పటికి పెద్దలు వీరి పెళ్ళికి ఒప్పుకుని వాళ్ళు హ్యాపీనెస్ కోరుకుంటున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news