Moviesస‌మంత‌కే ఎందుకిలా జ‌రుగుతోంది... ఆమె జాత‌కం ఎలా ఉంది... ఇన్ని క‌ష్టాలున్నాయా...!

స‌మంత‌కే ఎందుకిలా జ‌రుగుతోంది… ఆమె జాత‌కం ఎలా ఉంది… ఇన్ని క‌ష్టాలున్నాయా…!

ప‌దేళ్ల పాటు టాలీవుడ్‌నే కాదు.. సౌత్ సినిమా ఇండ‌స్ట్రీని ఊపేసిన స‌మంత‌కు గ‌త యేడాది కాలంగా వ‌రుస‌గా క‌ష్టాలు వెంటాడుతున్నాయి. స‌మంత టాలీవుడ్‌లో ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న అక్కినేని ఫ్యామిలీ ఇంట కోడ‌లిగా అడుగు పెట్ట‌డ‌మే పెద్ద సంచ‌ల‌నం. ఇక వీరి విడాకుల‌కు కొద్ది రోజుల ముందే ఆమె జాత‌కం బాగోలేద‌ని.. నాగ‌చైత‌న్య – స‌మంత విడాకులు తీసుకుంటారు వేణుస్వామి లాంటి జాత‌కులు చెప్పిన‌ప్పుడు చాలా మంది న‌మ్మ‌లేదు.

ఎంతో అన్యోన్యంగా కలిసి ఉండే ఈ జంట ఎందుకు ? విడాకులు తీసుకుంటార‌ని అనుకున్నారు. చివ‌ర‌కు వేణుస్వామి చెప్పిందే నిజ‌మైంది.. చైతు – సామ్ విడిపోయారు. చైతుతో విడాకుల త‌ర్వాత స‌మంత‌కు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ట్టు పైకి క‌నిపించినా.. ఆమెను మాత్రం వ‌రుస క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ప్ర‌స్తుతం స‌మంత వ‌రుస సినిమాల‌తో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి యంగ్ హీరో స‌ర‌స‌న ఖుషి సినిమా చేస్తోంది.

సినిమాల ఛాన్సులు ఎలా ఉన్నా ఆమె ప్ర‌స్తుతం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతూ చికిత్స కూడా తీసుకుంటుంది. అంత‌కు ముందు నుంచే ఆమెకు స్కిన్ స‌మ‌స్య‌లు ఉన్నాయి. అప్పుడు కూడా ర‌క‌ర‌కాల చికిత్స‌లు తీసుకుంది. ఇక ఇప్పుడు ఆమె జాత‌కం గురించి ప్ర‌ముఖ జ్యోతిష్కులు హ‌రిశాస్త్రి చెప్పిన విష‌యాలు వైర‌ల్ అవుతున్నాయి. ఆమె జాత‌కం ప్ర‌కారం చూస్తే ఆమెకు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే అంటున్నారు.

అలాగే ఆమె జాత‌క రీత్యా కొన్ని షాకింగ్ విష‌యాలు కూడా హ‌రిశాస్త్రి బ‌య‌ట పెట్టారు. వృత్తి ప‌రంగా, కెరీర్‌, సినిమాల ప‌రంగా ఆమె జాత‌కం బాగున్నా వ్య‌క్తిగ‌త‌, వైవాహిక జీవితంలో ఇప్ప‌టికే ఎలా ఇబ్బందులు ప‌డుతుందో అవి కంటిన్యూ కానున్నాయ‌ట‌. అలాగే ఆమె జాత‌కం ప్ర‌కారం ఆరోగ్య ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ట‌. ఆమె వ్య‌క్తిగ‌త జాత‌కంలో శ‌ని సంచారం ఉంద‌ని.. జాత‌క ప్ర‌కారం వ‌ల్లే చైతుతో అభిప్రాయ బేధాలు వ‌చ్చి విడాల‌కు వ‌ర‌కు వెళ్లింద‌ని ఆయ‌న చెప్పారు.

ఇక చైతు – స‌మంత భ‌విష్య‌త్తులో క‌లిసే అవ‌కాశాలు కూడా లేవ‌ని హ‌రిశాస్త్రి స్ప‌ష్టం చేశారు. ఏదేమైనా గ‌తంలో స‌మంత జాత‌కం విష‌యంలో వేణుస్వామి చెప్పింది నిజం కాగా… ఇప్పుడు హ‌రిశాస్త్రి చెప్పింది కూడా నిజం అవుతుందా ? అన్న సందేహాలు అయితే వ్య‌క్తం అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news