Moviesపుష్ప 2 కు రష్మిక షాకింగ్ కండీషన్.. సుకుమార్ మార్క్ షాక్...

పుష్ప 2 కు రష్మిక షాకింగ్ కండీషన్.. సుకుమార్ మార్క్ షాక్ తో అన్ని మూసుకోవాల్సిందేనా..!?

పుష్ప.. పుష్పరాజ్ .. నీ యవ్వ తగ్గేదేలే..ఈ డైలాగ్ వింటే తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి.. అలాంటివో స్పెషల్ అటెన్షన్ క్రియేట్ చేసుకునింది ఈ తగ్గేదేలే డైలాగ్ . మనకు తెలిసిందే గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన పుష్ప ది రైస్ సినిమాలో ని ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు . అంతేకాదు ఫస్ట్ టైం ఫుల్ లెంత్ మాస్ హీరోగా నటించి జనాలను ఆకట్టుకున్నాడు.

అంతేకాదు సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్నా కూడా డి గ్లామరస్ లుక్ లో కనిపించి జనాలను మెప్పించింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ తర్వాత అంతటి రేంజ్ మార్చుకున్న వ్యక్తి ఎవరు అంటే మాత్రం రష్మిక అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో “నా స్వామి రారా స్వామి” అంటూ నడుము తిప్పేసి మరి కుర్రాళ్ళ గుండెల్లో గిలిగిలి పెట్టింది. దీనితో ఒక్కసారిగా రష్మిక మందన్నా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది . ఈ క్రమంలోనే ఆమె ఏకంగా బాలీవుడ్ లో ఏడు బడా ప్రాజెక్టులకు సైన్ చేసింది.

కాగా రీసెంట్గా పుష్ప2 సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని రష్మికకు సంబంధించిన షాకింగ్ న్యూస్ బయటపడింది. పుష్ప1 సినిమా భారీ హీట్ అవ్వడంతో రష్మిక మందన పుష్ప2 సినిమాకు డబుల్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని.. ఈ క్రమంలోనే సుకుమార్ ఆమె క్యారెక్టర్ ను సగం సినిమాలో చనిపోయే విధంగా రాసుకున్నాడని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ ని రంగంలోకి దించే విధంగా స్టోరీని మలుచుకున్నాడట. దీంతో రష్మిక కెరీర్ చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంది. పుష్ప 2 సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకునేది . ఇలా అత్యాశకు పోయి ఎక్కువ పారితోషకం డిమాండ్ చేసి అనవసరంగా సినిమాలో ఫుల్ లెంత్ హీరోయిన్గా నటించే ఛాన్స్ చేసుకుంది అంటూ బాధపడుతున్నారు ఫ్యాన్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news