Moviesసమంత "యశోద" పబ్లిక్ టాక్: హిట్టా..ఫట్టా..?

సమంత “యశోద” పబ్లిక్ టాక్: హిట్టా..ఫట్టా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా రేంజ్ లో నటించిన మూవీ యశోద . హరి హర శంకర డైరెక్ట్ చేసిన ఈ మూవీ కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఉన్ని ముకుంద ,వరలక్ష్మి ,శరత్ కుమార్ ,రావు రమేష్ ,మురళీ శర్మ, సంపత్ రాజా కీలక పాత్రలో నటించిన యశోద సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమా మొత్తానికి మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది అంటున్నారు జనాలు.

అంతేకాదు సినిమాలో హీరో లేనప్పటికీ వన్ మాన్ ఆర్మీల సమంత హిట్ బాధ్యతలని తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించిందని చెప్పుకొస్తున్నారు . ప్రస్తుత కాలంలో జనాలు సరోగసి ప్రాసెస్ కి ఎలా అలవాటు పడ్డారు ..అలా సరోగసి ప్రాసెస్ చేసుకునే వాళ్ళ ఇబ్బందులు ఏంటి ..అన్న విషయాన్ని క్లియర్గా ఈ సినిమాలో చూపించారు . ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ మూవీ వచ్చిందే లేదు . కాగా యశోద తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ఒప్పుకొని మంచి పని చేశారు అంటున్నారు జనాలు.

ప్రతి ఒక్కరు సమాజంలో చూడవలసిన సినిమా . మరీ ముఖ్యంగా సరోగసి ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నా వాళ్లు చూడాల్సిన సినిమా అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .విడాకుల తరువాత ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా కాబట్టి మూవీ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు సామ్ ఫ్యాన్స్. వాటీని ఏ మాత్రం డిస్సప్పాయింట్ చేయకుండా..ఫ్యాన్స్ ని ఉత్సాహపరిచింది. సమంత తన ఆరోగ్యం బాగోలేనప్పటికీ సినిమాను ప్రమోట్ చేసి తనదైనా సహాయం చేసింది .

కాగా సినిమాలో సామ్ నటన పిక్స్ . ఇప్పటివరకు ఇలాంటి సమంతాను మీరు చూసే ఉండరు అంటున్నారు జనాలు. కాగా మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు సమంత చూపించిన ఎఫర్ట్ ఏ హీరోయిన్ కూడా చూయించుండదు అంటూ చెప్పుకొస్తున్నారు . సినిమా ఇంటర్వెల్ కి 20 నిమిషాల ముందు సీన్ మూవీకే హైలైట్ గా నిలిచింది. అంతేకాకుండా యాక్షన్ సీన్స్ లో సమంత ఫైట్స్ గూస్పన్స్ తెప్పిస్తున్నాయి అంటున్నారు జనాలు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా మొత్తానికి కర్త -కర్మ -క్రియ సమంతానే అంటున్నారు . ఏది ఏమైనా సరే విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఫుల్ లెంత్ హీరోయిన్గా తీసిన మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడం సమంత కెరీర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news