Moviesరంగస్ధలంలో సమంత రోల్ మిస్ చేసుకున్న అన్ లక్కి హీరోయిన్..ఈ సినిమా...

రంగస్ధలంలో సమంత రోల్ మిస్ చేసుకున్న అన్ లక్కి హీరోయిన్..ఈ సినిమా చేసుంటే జాతకం తిరిగిపోయేది..!!

జనరల్ గా సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరో స్టార్ హీరోతో చేయడం జరుగుతుంటాయి. అవి సర్వసాధారణం . కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వక కావచ్చు.. లేక వేరే కారణాలు ఏవైనా కావచ్చు ..అలా మంచి మంచి సినిమాలు మిస్ చేసుకున్న స్టార్ హీరోస్ బోలెడు మంది ఉన్నారు. అలాగే ఒక సినిమా కోసం అనుకున్న హీరోయిన్ ను చివరి నిమిషంలో మార్చేసి మరో హీరోయిన్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ లిస్టులోకే వస్తుంది సమంత.

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సమంత ఎంత పాపులారిటీ దక్కించుకుందో. ఏం మాయ చేసావే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన సమంత ఫస్ట్ సినిమాతో మంచి విజయం అందుకుంది . అంతేకాదు తెలుగులో యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది . ఈ క్రమంలోనే సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో ఫస్ట్ టైం సమంత డీ గ్లామరస్ లుక్ లో కనిపించింది .

అంతేకాదు తనదైన స్టైల్ తో వాక్చాతుర్యంతో మాట్లాడుతూ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది . సినిమా హిట్ సక్సెస్ కావడానికి సమంత నటన కూడా ఒక ప్రధాన కారణం . అయితే ఈ సినిమాకి సుకుమార్ మొదట హీరోయిన్గా అనుకునింది సమంతను కాదట . మహానటి కీర్తిసురేష్ ని . అయితే ఆ టైంలో కీర్తి సురేష్ వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడంతో ఈ పాత్రను వదులుకొనిందట .ఇక ఈ పాత్రను ఆమె వదులుకోవడం ఆమె కెరీర్ కె బిగ్గెస్ట్ మైనస్ అయింది.

ఎందుకంటే ఈ సినిమా తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఒకవేళ గాని కీర్తి సురేష్ ఈ పాత్ర చేసి ఉంటే కచ్చితంగా టాప్ హీరోయిన్ల లిస్టులో యాడ్ అయ్యుండేది . అఫ్ కోర్స్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ లిస్టులో ఉంది కానీ కీర్తి సురేష్ ఖాతాలో బోలెడన్ని ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. అదే ఈ సినిమా చేసి ఉంటే ఆ ఫ్లాప్స్ తప్పించుకుని సమంత లా పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటీ దక్కించుకునేది..ఏది ఏమైనా సరే కీర్తి సురేష్ కధల ఎంపిక ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news