Moviesస్టార్ సెలబ్స్ ఎక్కువుగా విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా..? అమ్మాయిలు మరీ...

స్టార్ సెలబ్స్ ఎక్కువుగా విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా..? అమ్మాయిలు మరీ అంత ముదిరిపోయారా..?

ఈ మధ్యకాలంలో మనం విడాకులు అనే పదం ఎక్కువగా వింటున్నాం . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ అందరూ విడాకులు తీసుకొని వేరువేరుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అయితే దీనికి కారణాలు ఏవై ఉంటాయో అంటూ సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది . కాగా ఎక్కువ శాతం జనాలు విడాకులకి మెయిన్ రీజన్ అమ్మాయిలే అంటూ చెప్పుకొస్తున్నారు.

మేము సంపాదిస్తున్నాం.. మాకు కోరికలు ఉంటాయి..స్వేచ్చా అనే సాకుతో హెడ్ వెయిట్ తో భర్త మాట వినకపోవడం.. ఇలాంటి విడాకులకు కారణం అవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా మరికొందరు స్టార్ సెలబ్రిటీస్ ఇల్లీగల్ ఎఫైర్లు కారణంగా ఇలా ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ఆధారంగా తెలుస్తుంది . అయితే ఇలా విడాకులు తీసుకోవడానికి మరో బిగ్గెస్ట్ రీజన్ తల్లిదండ్రుల పెంపకం అంటున్నారు సినీ విశ్లేషకులు.

డబ్బులు ఉన్నాయి కదా అని ఏది అడిగినా అది ఇవ్వడం.. ప్రేమించాము అనగానే వాళ్ల ప్రేమ నిజమా కాదా అని ఆలోచించకుండా కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేసేయడం.. తీరా వాళ్ల అవసరాలు తీరిపోయాక ఆ ప్రేమ మాయమైపోవడం ..పెళ్లి బంధం పెటాకులు అవడం ఈ కాలంలో ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఒకే ఏజ్ కి దరిదాపుల్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న గాని బిగ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

జీవితంలో ఏదైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అని పాపులారిటీ కోసం పబ్లిసిటీ కోసం పెళ్లిళ్లు చేసుకుంటే విడాకులే లాస్ట్ కు మిగులుతాయని చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చిన్న చిన్న తగాదాలకు విడాకులు తీసుకొని పెళ్లి అనే బంధానికి ఉన్న పవిత్రమైన పరువును కూడా తీసేస్తున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . భార్యాభర్తలు తమ పర్సనల్ విషయాన్ని మూడో వ్యక్తులకి షేర్ చేయకుండా తమ ప్రాబ్లమ్స్ తామే సాల్వ్ చేసుకుంటే విడాకుల వరకు వెళ్లదని ..ఏ బంధం పర్ఫెక్ట్ కాదని పర్ఫెక్ట్ గా మలుచుకునే తత్వం ఉండాలని వాళ్లు చెప్పుకొస్తున్నారు . ఈ సజీషన్ ను మన ఇండస్ట్రీలో ఉండే జంటలు పాటిస్తారో ఏమో చూద్దాం..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news