Moviesకాస్ట్లీ కారు కొన్న షణ్ముఖ్..రేటు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. స్టార్...

కాస్ట్లీ కారు కొన్న షణ్ముఖ్..రేటు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. స్టార్ హీరో వేస్ట్..!!

సోషల్ మీడియా స్టార్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వెండితెరపై స్టార్ హీరోలకు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను బుల్లితెరపై దక్కించుకున్న ఏకైక యూట్యూబర్ షణ్ముఖ్. ప్రజెంట్ ఉండే స్టార్ హీరోలు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో యూట్యూబ్లో షణ్ముఖ్ జస్వంత్ అంతకన్నా డబుల్ స్థాయి ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నారు . టాలెంట్ ఉంటే జనాలు ఆదరిస్తారు అని సోషల్ మీడియా ద్వారా తన టాలెంట్ ను జనాలకు పరిచయం చేసి.. అనతి కాలంలోనే స్టార్ యూట్యూబర్ గా ఎదిగాడు .

కాగా షణ్ముఖ్ బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత ఆయన కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు షణ్ముఖ్ రేంజ్ ర్లా ఉందో.. బిగ్ బాస్ తర్వాత ఎలా మారిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఆయన కథ మొత్తం తిరిగిపోయింది . ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పేసింది. ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోయింది. చిదరించుకునే జనాలు ఎక్కువైపోయారు . దాని అంతటికీ కారణం బిగ్ బాస్ లో షణ్ముఖ్ నడుచుకున్న తీరు. తోటి కంటెస్టెంట్ సిరి తో ఆడిన ఆటలు.. బిహేవ్ చేసిన పద్ధతి. అది అంతా మనకు తెలిసిందే. దీంతో బిగ్ బాస్ టైటిల్ కొట్టాల్సిన షణ్ముఖ్ జస్వంత్ రన్నర్ గా మిగిలి బయటకు వచ్చేసాడు. అయితే బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్లతో ఫుల్ ఫామ్ లో ఉన్న షణ్ముఖ్ జస్వంత్.. రీసెంట్గా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

బిగ్ బాస్ దసరా పండుగ వేళ ఒక కాస్ట్లీ కార్లు కొనుక్కున్నాడు. దీంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు. జనరల్ గా బీఎండబ్ల్యూ చాలా కాస్ట్లీ. సామాన్య ప్రజలు కొనలేరు. స్టార్ సెలబ్రిటీస్ మాత్రమే కొనగలరు. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో బిఎండబ్ల్యూ చాలా తక్కువ మంది దగ్గరే మాత్రమే ఉంది . ఎవరో టాప్ మోస్ట్ సెలబ్రెటీస్ దగ్గర బిగ్ షాట్స్ దగ్గర మాత్రమే ఉంటుంది . అలాంటి కారుని ఇప్పుడు షణ్ముఖ్ సొంతం చేసుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది . దసరా పండుగ వేళ కొత్త కారు పక్కనే షణ్ముఖ్ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ కారు ఖరీదు 72 లక్షలు గా తెలుస్తుంది. దీంతో ఇంతటి లగ్జరీ కార్ కొన్నా షణ్ముఖ్ జశ్వంత్ స్టార్ హీరోల ప్లేస్ లోకి యాడ్ అయిపోయారు . మరికొందరైతే ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ లో యంగ్ హీరోలు కూడా ఇంత కాస్ట్లీ కారు కొనలేదు నీ ముందు వాళ్లు కూడా వేస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news