Moviesనా డ్రీమ్ క్యారెక్టర్‌..ఆమె దొబ్బేసింది.. షాకింగ్ విషయాని బయటపెట్టిన మీనా..!!

నా డ్రీమ్ క్యారెక్టర్‌..ఆమె దొబ్బేసింది.. షాకింగ్ విషయాని బయటపెట్టిన మీనా..!!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ అనుకున్న పాత్రను మరో హీరోయిన్ దక్కించుకోవడం సర్వసాధారణం, ఫామ్ లో ఉండే హీరోయిన్స్ ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిట్ అవుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే వాళ్ళ దగ్గరికి వచ్చిన సూపర్ బ్లాక్ బస్టర్ కథను రిజెక్ట్ చేయగా.. ఆ కథ వేరే వాళ్లకు వెళ్లి ఆ హీరోతో హిట్ కొట్టి లైఫ్ లో సెటిల్ అయినా ముద్దుగుమ్మలు సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు. అయితే అలాంటి కథలను మిస్ చేసుకున్నప్పుడు కచ్చితంగా ఎవరికైనా సరే జలసి ఫీలింగ్ ఉంటుంది . అసూయ కలుగుతుంది. ఇంత మంచి కథను మనం చేయలేకపోయాను అని బాధపడతారు . ప్రజెంట్ అదే బాధను ఓపెన్ గా చెప్పేసింది కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనా.

మీనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరిస్తూ టాలీవుడ్ బాలీవుడ్ మలయాళం లో బోలెడన్ని సినిమాల్లో నటించి.. చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పటికి మీనా నటన ఇష్టపడే జనాలు ఉన్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. ఎలాంటి రోల్ నైనా సరే మీనా అవలీలగా నటించగలరు. అలాంటి ఓ ఫుల్ ఫైర్ ఉన్న హీరోయిన్ నే మీనా. కాగా రీసెంట్గా ఓ హీరోయిన్ ని చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓపెన్ గా ఆ హీరోయిన్ అంటే నాకు అసూయ అంటూ చెప్పకు వచ్చింది మీనా . దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “పోనియన్ సెల్వన్” సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

పక్కాగా చెప్పాలంటే తమిళనాడులో తప్ప ఈ సినిమా మరి ఎక్కడ హిట్ అవ్వలేదు. తమిళ్ జనాలకు పిచ్చిపిచ్చిగా పిచ్చెక్కించేలా ఎక్కేసింది ఈ సినిమా. అయితే పోనియన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ పాత్ర ఎంత అద్భుతంగా ఉంది అనే దానిపై రివ్యూలు ఇవ్వక్కర్లేదు. చూడగానే ఆకట్టుకునే అందం ఆమె సొంతం. అలాంటి అందాన్ని మరింత అందంగా చూపించడంలో ఫుల్ సక్సెస్ అయ్యారు డైరెక్టర్. అయితే నిజానికి ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ పాత్ర మీనా డ్రీమ్ ప్రాజెక్ట్ అని మీనా చెప్పుకొచ్చింది. కానీ ఇప్పటివరకు ఆమెకు అలాంటి ప్రాజెక్టు రాలేదట. దీంతో ఫస్ట్ టైం ఐశ్వర్య ని చూస్తుంటే అసూయ పడుతున్నాను అని.. నా కెరియర్ లోనే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి పడుతున్నానని మీనా చెప్పుకొచ్చింది. దీంతో ఐశ్వర్య రాయ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఐశ్వర్య అందం ముందు ఎవరైనా దిగదుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు.

 

 

View this post on Instagram

 

A post shared by Meena Sagar (@meenasagar16)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news