Moviesనొప్పి ఒకరిది ..సుఖం మరొకరిది.. సమంత మాటలకు అర్ధం అదేనా..?

నొప్పి ఒకరిది ..సుఖం మరొకరిది.. సమంత మాటలకు అర్ధం అదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా యశోద. ఈ సినిమాకు ఈ సినిమాను కొత్త దర్శకుడు హరి హరీష్ డైరెక్ట్ చేసాడు . ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేశారు . ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా నిన్న సాయంత్రం.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్ ని బట్టి చూస్తే.. ఈ సినిమాలో సమంత సింగిల్ మాన్ ఆర్మీల అన్ని షాట్స్ లోను ఆమెనే హైలెట్ అయింది. ట్రైలర్ చూస్తే అందరికీ ఆ విషయం క్లియర్గా అర్థమైపోతుంది . ఇది సరోగసి ప్రాసెస్ కి సంబంధించిన ధీమ్ పై తెరకెక్కిందని తెలిస్పోయింది. మరి ముఖ్యంగా ట్రైలర్ మొదట్లో “మీరు ఎప్పుడైనా రెండు గుండెచప్పుడ్లు వినిపించాయా” అంటూ సమంత తన కడుపులో మోస్తున్న బిడ్డ గురించి చెప్పడం.. అందరు తల్లిలకి బాగా కనెక్ట్ అయింది .

 

అయితే ట్రైలర్ ముందుకెళ్లే కొద్ది అసలు విషయం బయటపడింది . సమంత ఈ సినిమాలో సరోగేత్ మదర్ గా కనిపిస్తుంది , యాక్షన్ సీన్స్ తో సమంత అదరగొట్టేసింది అని చెప్పాలి. ఈ చిత్రంలో రావు రమేష్ ,వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మరీ ముఖ్యంగా ప్లస్ పాయింట్ మణిశర్మ సంగీతం.

కాగా ఈ సినిమా ఈ ట్రైలర్ చూసిన సరోగేట్ మదర్స్ ఓ విషయాన్ని వైరల్ చేస్తున్నారు . ఈ సినిమా ద్వారా మా బాధ తెలుస్తుందని..”నొప్పి ఒకరిది సుఖం మరొకరిది” అంటే ఏంటో మీరు ఈ సినిమాలో చూస్తారు అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ సినిమాతో సమంత ఉమెన్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు . చూడాలి మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news