Moviesవిజయ్ దేవరకొండతో ఎఫైర్ పై రష్మిక మందన్నా హాట్ కామెంట్స్.. ...

విజయ్ దేవరకొండతో ఎఫైర్ పై రష్మిక మందన్నా హాట్ కామెంట్స్.. కన్నడ పిల్ల తెలివికి దండం పెట్టాల్సిందే..!?

సినీ ఇండస్ట్రీలో ఎంత సైలెంట్ గా ఉన్నా కానీ స్టార్ హీరో పై హీరోయిన్స్ పై రూమర్లు రావడం సర్వసాధారణం. సైలెంట్ గా ఉండే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పై కూడా రూమర్లు వచ్చాయి. అయినా వాటిని ఆయన లైట్ గా తీసుకున్నారు. అంతేకాదు ఏదైనా ఇంటర్వ్యూలో అలాంటి రూమర్ గురించి ప్రశ్నలు ఎదురైతే మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇస్తారు. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లు ఉంది ఈ కన్నడ బ్యూటీ రష్మిక మందన.. అందుకే తనపై వచ్చిన అన్ని రూమర్స్ లో క్రేజీ రూమర్ గా నిలిచిన విజయ్ దేవరకొండ తో అఫైర్ గురించి పబ్లిక్ గా ఆన్సర్ ఇస్తూ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది.

కన్నడ బ్యూటీ రష్మిక మందన ఈ పేరు తెలుగు మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. “ఛ్లో” అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హాట్ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి ఎంటర్ అయిన అతి తక్కువ టైంలోనే బిగ్ స్టార్ సినిమాలో అవకాశాలు అందుకుంటూ చేసిన ప్రతి సినిమా హిట్ కొట్టింది . తద్వారా పాన్ ఇండియా హీరో సినిమా పుష్ప లో అవకాశం దక్కించుకుంది. ఇక పుష్ప సినిమా హిట్ తో రష్మిక మందన్న పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిరోగిపోయింది. అంతేనా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది.

అయితే ఆమె తన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ సినిమా గీతాగోవిందంతో విజయ్ దేవరకొండకు రష్మికకు మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇక వాటికి ఆజ్యం పోస్తున్నట్లు రష్మిక మందన విజయ్ దేవరకొండ ముంబైలో నైట్ పార్టీలకు వెళ్లడం ..డిన్నర్ డేట్ లాంటి ఫొటోస్ పెట్టడం.. విజయ్ షూటింగ్స్ స్పాట్ లో రష్మిక కనిపించడం.. రష్మిక కోసం విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కి రావడం,, ఇవన్నీ చూసిన జనాలు వీళ్ళ మధ్య ఏదో కాదు ప్రేమ అనే సంబంధం ఉంది అంటూ ఫిక్స్ అయిపోయారు .

అయితే రీసెంట్ గా దీనిపై ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక స్పందించింది. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మీకు విజయ్ దేవరకొండకు మధ్య వస్తున్న రూమర్స్ పై మీరు ఏమంటారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..” చాలా క్యూట్ గా అనిపిస్తుంది” అంటూ సింగిల్ లైన్ లోనే బోలెడన్ని అర్ధాలు వచ్చి మీనింగ్ ఇచ్చింది. దీంతో నీకు దండం పెట్టాలి రష్మిక అంటూ నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అటు విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ లో లేను అని చెప్పలేదు ..ఉన్నాను అని చెప్పలేదు ..జస్ట్ క్యూట్ అని చెప్పింది. నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేకపోతే రష్మిక మందన్నా..మేముఫ్రెండ్స్ అని చెప్పాలి కదా.. మరి చెప్పలేదంటే వీరి మధ్య ఉన్నది ప్రేమే కదా అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news