Newsద్యావుడా..డైరెక్టర్ పై కోపంతో హీరో నాని చెత్త పని..వీడియో లీక్..!!

ద్యావుడా..డైరెక్టర్ పై కోపంతో హీరో నాని చెత్త పని..వీడియో లీక్..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం “లీక్”. సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమాకు సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ కానివ్వండి, ఫైటింగ్ సీన్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించక ముందే కొందరు లీకు రాయాళ్లు సోషల్ మీడియా వేదికగా ఆ సీన్స్ ని రిలీజ్ చేసి సినిమాకు కోలుకోలేని షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా సరే లీకు రాయళ్లు ఆటలకు చెక్ పెట్టాలని చాలామంది బిగ్ డైరెక్టర్స్ సినిమా షూటింగ్ సెట్స్ లో మొబైల్ ను బ్యాన్ చేశారు. కాగా ఇప్పుడు సొంత హీరోనే తాను చేస్తున్న సినిమాకు సంబంధించిన వీడియోను లీక్ చేసి సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.

మనకు తెలిసిందే గత కొంతకాలం నుండి హీరో నాని కి సరైన హిట్ పడడం లేదు . దీంతో సినీ ఇండస్ట్రీ ఆయన్ని హీరోగా లెక్కలోకి తీసుకోవడం లేదు అన్న రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆయన లాస్ట్ నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఆయన దగ్గర నుంచి రాబోతున్న తన తదుపరి సినిమాపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనున్నారు నాని అభిమానులు. తన తదుపరి సినిమాను శ్రీకాంత్ ఓదెల తో తీస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాకు దసరా అని టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మూవీ 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుందని సినిమా షూటింగ్ ప్రారంభమైన అప్పుడే చెప్పుకొచ్చారు .

కాగా ఈ సినిమాలో నాని కెరియర్ లోనే ఫస్ట్ టైం పూర్తిస్థాయి డీ గ్లామర్ రోల్ లో ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఆయన లుక్స్ ఫాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే అక్టోబర్ 3న దసరా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తామని టీం చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే నాని అభిమానులు ఈ క్రేజీ అప్డేట్ కోసం ఆతృతగ ఎదురు చూసారు. ఈ మూవీ నుండి ఎలాంటి ప్రోమో విడుదల చేయడం లేదని ఫ్యాన్స్ ని హార్ట్ చేశాడు సినిమా డైరెక్టర్. ఈ క్రమంలోనే హీరో నాని కోపంతో తన సినిమాకు సంబంధించిన వీడియోను తానే లీక్ చేసుకున్నాడు.

నాని తన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాలో సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్ ని అప్లోడ్ చేశారు. దీనికి క్యాప్షన్ గా ఆయన ” శ్రీకాంత్ దసరా పండుగ సందర్భంగా ఎలాంటి ప్రోమోను రిలీజ్ చేయడం లేదని చెప్పారు. సో నేనే నా ఫ్యాన్స్ కోసం నా మొబైల్లో షూట్ చేసిన క్లిప్ ను ఆప్ లోడ్ చేస్తున్నాను. రేపటి నుంచి దుమ్ము లేచిపోద్ది” అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో నాని చేసిన ట్వీట్ వైరల్ గా మారింది . అంతేకాదు కొందరు ఫ్యాన్స్ “నీ సినిమా ప్రమోషన్స్ కోసం మీ సినిమాను నువ్వే లీక్ చేసుకున్నావా.. ఇంతకన్నా చెత్త పని మరొకటి ఉండదు” అంటూ కామెంట్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం.. ఈ సీన్లో నాని మాస్ లుక్ అదిరిపోయింది అని.. కచ్చితంగా ఇండస్ట్రీకి మరో పుష్పాలాంటి హిట్ దక్కుతుందని చెప్పుకొస్తున్నారు “.మరి చూడాలి దసరా మూవీతో నాని ఎలాంటి హిట్ కొడతాడో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news