Moviesకెవ్వు కేక: పబ్లిక్ గానే అలాంటి మాటలు.. నాగార్జున నాటీ...

కెవ్వు కేక: పబ్లిక్ గానే అలాంటి మాటలు.. నాగార్జున నాటీ ఆన్సర్ వింటే నవ్వు ఆగదు(వీడియో) ..!!

టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఈ పేరు కన్నా కూడా అందరూ ఆయన్ని మన్మధుడుగానే గుర్తు పెట్టుకున్నారు. అక్కినేని ఇంటి వారసత్వం ను అందిపుచ్చుకొని తనదైన స్టైల్ లో నటిస్తూ టాలీవుడ్ మన్మధుడుగా పేరు సంపాదించుకున్న నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల భార్యలు కూడా ఆయనకు బిగ్ ఫాన్స్ గా ఉన్నారు. ఇప్పటికీ నాగార్జున టాలీవుడ్ కి మన్మధుడే . అలాంటి ఓ చెరగని ముద్రను తనపై వేసుకున్నాడు నాగార్జున . ఇద్దరు కొడుకులు సినీ ఇండస్ట్రీలో హీరోగా వచ్చిన ఇప్పటికీ నాన్నతో కంపేర్ చేస్తే వాళ్ళ గర్ల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ నే చెప్పాలి.

రీసెంట్గా “ఘోస్ట్” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ముగ్గురు పక్కపక్కన నిల్చుంటే అందరూ నాగార్జునని చూసే విజిల్స్ వేశారు. అలాంటి అందం ఆయన సొంతం. కాగా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో రచ్చ చేస్తున్న నాగార్జున.. తాజాగా హీరోగా నటించిన చిత్రం “ది ఘోస్ట్” ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లు తెరకెక్కిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేసాడు నాగార్జున. ఈ క్రమంలోనే ఓ మీడియా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ స్పెషల్ ట్రైలర్ ని లాంఛ్ చేశారు. అంతేకాదు మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇస్తూ..అందరిని నాగార్జున నవ్వించాడు. ఈ క్రమంలోనే ఓ ఫన్నీ ఇన్సిడెంట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఓ రిపోర్టర్ నాగార్జునతో మాట్లాడుతూ..” మీరు ఆన్ స్క్రీన్ లో అమ్మాయిలతో రొమాన్స్ బాగా చేస్తారు. మరి మీకు అమ్మాయిలతో రొమాన్స్ చేయడం బాగా ఇష్టమా.. లేక గన్ తో ఫైరింగ్ చేయడం ఇష్టమా “అంటూ ఓపెన్ గానే అడిగేసాడు. దీంతో ఫస్ట్ పెద్దగా నవ్వేసిన నాగార్జున ఆ తర్వాత క్వశ్చన్ రిపీట్ అంటూ మళ్ళీ అడిగాడు. మళ్ళీ రిపోర్టర్ క్వశ్చన్ రిపీట్ చేశాడు. ఇక అప్పుడు నవ్వుతూ నాగార్జున అన్సర్ ఇస్తూ..” ఒక చేతిలో అమ్మాయి ..మరో చేతిలో గన్.. ఇదే నాకు ఇష్టం” అంటూ నాటి ఆన్సర్ ఇచ్చాడు. ఈ ఒక్క మాటతో స్టేడియంలో అరుపులు కేకలతో విజిల్ తో మారుమ్రోగిపోయింది. అంతేకాదు మరోసారి మన్మధుడు అంటే ఇదే అంటూ ప్రూవ్ చేసుకున్నాడు నాగార్జున . ఇలా ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అనేక ప్రశ్నలు అడిగారు వాటన్నింటికి ఓపిగ్గా సమాధానం చెప్పుకొచ్చాడు నాగార్జున. దీంతో నాగార్జున నాటి ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు ” నీ ముందు నీ కొడుకులు కూడా వేస్ట్” అంటూ అక్కినేని అభిమానులే కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాతో నాగార్జున ఖాతాలో ఎలాంటి హిట్ పడబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news