Moviesనా సినిమాలో ఆ అమ్మాయి వద్దు అంటే వద్దు.. మహేశ్ సంచలన...

నా సినిమాలో ఆ అమ్మాయి వద్దు అంటే వద్దు.. మహేశ్ సంచలన నిర్ణయం ..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జంటలు తెరపై భళే ముద్దుగా ఉంటాయి . నిజంగా ఎవరైనా సరే రిలేషన్ షిప్ తెలియని వాళ్ళు చూస్తే నిజం లవర్స్ అని లేదా భార్యాభర్తలను అనుకుంటారు . అంతలా వాళ్ళ కెమిస్ట్రీ తెరపై సూపర్ గా వర్కౌట్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా అలాంటి చూడ చక్కని రియల్ కపుల్స్ బోలెడు మంది ఉన్నారు . వాళ్ళల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యూట్ రియల్ కపుల్ మహేష్ బాబు-భూమిక. వీళ్ళిద్దరి కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు చూడ చక్కగా ముచ్చటగా ఉంటారు.

తెర పై ఈ జంట కనిపిస్తే చాలు ఆడియన్స్ విజిల్స్ తీ కేకలు వేస్తూ రచ్చ రంబోలా చేస్తారు. వీళ్లిద్దరు కలిసి నటించిన సినిమా ఒక్కడు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు కొల్లగొట్టింది, అప్పటివరకు మహేష్ బాబు సైలెంట్ హీరో అని అంతా అనుకున్నారు. కానీ మహేష్ బాబును జనాలకు దగ్గర చేసిన సినిమా ఒక్కడునే. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది . గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా..భూమిక హీరోయిన్గా నటించింది . అంతేకాదు ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్ ఇరగదీసాడు . ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మణిశర్మ సంగీతం .ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు మన ప్లే లిస్ట్ లో ప్లే అవుతూనే ఉంటాయి.

ఇదే సినిమా తమిళం,కన్నడ, హిందీ ,బెంగాలీ భాషల్లో పునర్మితమైంది. కాగా నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా మొదట అనుకునింది గుణశేఖర్ సోనాలి బింద్రే నట. మహేష్ బాబు సరసన అప్పటికే మురారి సినిమాలో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సోనాలి ..ఈ సినిమాలో నటిస్తే మరీ అందంగా ఉంటుందని సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని అనుకున్నారట. అయితే మహేష్ బాబు మాత్రం తన సినిమాలో సోనాలి వద్దు అంటే వద్దు అని మొండి చేశాడట. దానికి కారణం “మురారి సినిమాలో ఆల్రెడీ ఒకసారి మా ఇద్దరి జంటని తెరపై చూసేసారు ..మళ్ళీ అదే హీరోయిన్ ని రిపీట్ చేస్తే జనాలకి బోర్ కొడుతుంది. ఎవరైనా కొత్త అమ్మాయి పడితే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. జనాలకు ఇంట్రెస్ట్ కలుగుతుంది ” అంటూ చెప్పాడట.

అయినా కానీ గుణశేఖర్ వినకుండా సోనాలి అయితే బాగుంటుందని రెండు మూడు సార్లు ఆమె పేరు సజీష్ట్ చేశారట. దీంతో కోప్పడిన మహేష్ బాబు “నా సినిమాలో సోనాలి బింద్రే వద్దు. ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకోరండి “అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చాడట . అప్పుడు ఒక్కసారిగా భూమిక పేరు హైలెట్ గా మారడం ఆమెని సినిమాలోఖి తీసుకోవడం జరిగింది. సినిమాలో ఆమె నటించిన నటనకు అందరూ ఫిదా అయ్యారు . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే జనాలు ఫ్యామిలీ మొత్తం ఒక్క దగ్గర కలిసి కూర్చొని చూస్తారు. అంతలా జనాలకు ఎక్కేసింది ఈ సినిమా

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news