Moviesదివాళి పార్టీలో నోరు జారిన ఛార్మి .. పాపం అడ్డంగా బుకైన...

దివాళి పార్టీలో నోరు జారిన ఛార్మి .. పాపం అడ్డంగా బుకైన పూరి జగన్నాధ్..!?

అయ్యయ్యో ..తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ టైంలో ప్రమోషన్ టైంలో హీరో విజయ్ దేవరకొండ ,డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ అనన్య పాండే ప్రొడ్యూసర్ చార్మి-కరణ్ జోహార్ చేసిన హంగామా అంతా అంతా కాదు .ఇది ఓ బాహుబలి టైప్ హిట్ అందుకుంటుందని నానా హంగామా చేశారు.

అంతేనా ముంబై రోడ్లల్లో ప్రమోషన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు . మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పెట్టిన ప్రెస్ మీట్ లో కాలు మీద కాలేసుకుని కూర్చోడం కూర్చోవడం అప్పట్లో సంచలనంగా మారింది . అంతేకాదు ఈ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసేస్తుంది అంటూ జనాలు ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేసారు. సీన్ కట్ చేస్తే సినిమా ఫస్ట్ షో పడగానే బొమ్మ టాక్ ఏంటో అర్థం అయిపోయింది . సొంత పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ నే ఈ సినిమాను చూసి చెత్తగా ఉందంట రివ్యూ ఇచ్చారు.

దయచేసి నీకు దండం పెడతాను ఇంకోసారి సినిమాలు తీయద్దురా బాబోయ్ అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే లైగర్ సినిమాపై పెట్టిన డబ్బంతా నష్టపోయామని ఛార్మి ఏడ్చింది అంటూ న్యూస్ వైరల్ గా మారింది. కాగా రీసెంట్గా లైగర్ సినిమా లెక్కలు మరోసారి బయటపడ్డాయి . దివాళి సందర్భంగా స్టార్ హీరో ఇచ్చిన దివాళి ట్రీట్ కి అటెండ్ అయిన చార్మి అక్కడ తాగేసి టంగ్ స్లిప్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు లైగర్ సినిమాకి ఎటువంటి నష్టం రాలేదని ..వాళ్ళు పెట్టిన డబ్బు పెట్టినట్లు వచ్చేసిందని చెప్పుకొచ్చిందట.

అంతా అనుకున్నట్టు లైగర్ వల్ల తమకేమీ నష్టాలు రాలేదని ..ధియేట్రికల్ బిజినెస్ నాన్ ధియేట్రికల్ బిజినెస్ వల్ల వాళ్లు పెట్టిన డబ్బులు అన్ని తమకు వచ్చేసాయని ..దీంతో చింతించాల్సిన విషయం ఏమీ లేదు అంటూ తాగిన మత్తులో టంగ్ స్లిప్ అయిందట. ఈ క్రమంలోనే లైగర్ డిస్ట్రిబ్యూటర్స్ .. బయ్యర్లు పూరి జగన్నాథ్ పై దండయాత్రకు సిద్ధపడ్డారట. తమ డబ్బులను తిరిగి ఇచ్చేవరకు వదిలే ప్రసక్తి లేదని కావాలంటే ఫిలిం ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగుతామని వార్నింగ్ ఇస్తున్నారట. మరి చూడాలి పూరి జగన్నాథ్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో.. ఏది ఏమైనా సరే ఒక పెగ్గుకి ..పూరి జగన్నాథ్ జీవితాన్ని బలి చేసేసింది చార్మీ అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news