Moviesనన్ను అక్కడ అసభ్యకరంగా టచ్ చేసాడు - 'బిగ్ బాస్'లో మరో...

నన్ను అక్కడ అసభ్యకరంగా టచ్ చేసాడు – ‘బిగ్ బాస్’లో మరో లొల్లి.. వీడియో వైరల్..!!

బిగ్ బాస్ ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ సిక్స్ కొనసాగుతుంది . అయితే గత సీజన్స్ తో కంపేర్ చేస్తే సీజన్ 6 డిజాస్టర్ గా మారింది .పరమ చెత్త టీఆర్పీ రేటింగ్ సంపాదించుకుని అన్ని సీజన్స్ లో కల్లా ఈ షో ఫ్లాప్ అయింది . కాగా బిగ్ బాస్ తెలుగులో పాటు తమిళ్లో కూడా స్టార్ట్ అయింది. తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ గా కమల్ హాసన్ చేస్తున్నాడు.

కాగా ఇప్పటికే ఈ షోలో రసవత్తరంగా గొడవలు జరుగుతున్నాయి . రోజులు గడిచే కొద్ది కంటెస్టెంట్స్ లో ఫైర్ పెరుగుతుంది .కన్నింగ్ స్టాటజీలు ఉపయోగిస్తూ ఒక్కొక్కరుగా షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు . ఈ షో నుంచి మొదట ఎలిమినేట్ అయిన శాంతి ఆదివారం నుంచి వెళ్ళిపోయింది . కాగా జిపి ముత్తు కొన్ని పర్సనల్ కారణాలు కారణంగా హౌస్ నుంచి తప్పుకోవడంతో ప్రజెంట్ 19 మంది కంటెస్టెంట్లు తమిళ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు . దీంతో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర పోటి నెలకొంది.


కాగా బిగ్బాస్ లో ప్రస్తుతం బొమ్మ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కనివిని ఎరుగని రీతిలో బిగ్ బాస్ సీజన్ లో ఉత్కంఠంగా సాగుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో కూడా బిగ్ బాస్ రిలీజ్ చేశారు .టాస్క్ లో భాగంగా అజీమ్ కు అడ్డుగా నిలబడిన ధనలక్ష్మిను తోసేసిన దృశ్యాలు ప్రోమోలో క్లియర్గా కనిపిస్తున్నాయి .దీంతో ఒక్కసారిగా ధనలక్ష్మి అజీం పై ఆగ్రహం వ్యక్తం చేసింది .

అంతే కాదు “నువ్వు నన్ను ఎక్కడ టచ్ చేసావో తెలుసా..నేను వెళ్ళనివ్వను” అంటూ ఆమె ఫైర్ అయిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విక్రమ్… ధనలక్ష్మి సపోర్టుగా అజీమ్ తో వాదిస్తున్నట్లు దృశ్యాలు కూడా మనం ప్రోమో లో చూడొచ్చు . మొత్తానికి బొమ్మ టాస్క్ కంటెస్టెంట్ల మధ్య మంచి కంటెంట్ క్రియేట్ చేసింది . చూడాలి మరి హోస్ట్ కమలహాసన్ ఏ విధంగా ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేస్తారో..?

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news