Moviesఅనిరుధ్‌లో ఆ కోరికలు అంత ఎక్కువా ... అందుకే హీరోయిన్స్‌తో అలా..?

అనిరుధ్‌లో ఆ కోరికలు అంత ఎక్కువా … అందుకే హీరోయిన్స్‌తో అలా..?

కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సౌత్‌లో బాగా పాపులర్ అయ్యాడు. ఆ పాపులారిటీతోనే తెలుగులో కూడా సినిమాలకి సంగీతం అందించే అవకాశాలను అందుకున్నాడు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాని లాంటి స్టార్స్ నటించిన సినిమాలకే. అయితే, తెలుగులో అనిరుధ్ సంగీతం అందించిన సినిమాలు మ్యూజికల్‌గా ఆశించిన సక్సెస్ సాధించలేదు. అయినా కాస్తో కూస్తో మన తెలుగు ఇండస్ట్రీలో అనిరుధ్‌కి క్రేజ్ ఉంది. కానీ, తమిళంలో ఈ యంగ్ సెన్షేషన్ అంటే అసాధారణమైన క్రేజ్.

తమిళంలో అనిరుధ్‌ సంగీతం అందించిన సినిమాలు అటు మ్యూజికల్‌గా ఇటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. అందుకే, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ కంటే కూడా అనిరుధ్ ఎక్కువ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్య రెహమాన్ దూకుడు బాగా తగ్గింది. ఒకప్పుడు క్షణం తీరిక లేకుండా సినిమాలకి సంగీతం అందించిన రెహమాన్.. ప్రస్తుతం కాస్త స్లోగా సాగుతున్నాడు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో మ్యూజిక్ పరంగా హాట్ టాపిక్ అంటే అనిరుధ్ మాత్రమే.

ఆ మధ్య విజయ్, పూజా హెగ్డే నటించిన బీస్ట్ సినిమాలోని మలపిత్తా పిత్తాదే సాంగ్ ఎంతటి సెన్షేషన్ అయిందో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అనిరుధ్‌ చేతిలో భారీ చిత్రాలున్నాయి. ఇంత క్రేజ్ ఉన్న అనిరుధ్‌కి హీరోయిన్ అవ్వాలనే తహ తహ మాత్రం బాగానే ఉందనిపిస్తోంది. ఎక్కువగా స్క్రీన్ మీద కనిపించడానికి ఆరాటపడుతుంటాడు. అంతేకాదు, హీరోయిన్స్ అందరితోనూ మంచి రిలేషన్ మేయింటైన్ చేస్తూ వస్తున్నాడు. కొందరితో మరీ సన్నిహితంగా కూడా మెలుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.

దీనికి ఆజ్యం పోస్తూ సుచీ లీక్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌తోనూ అనిరుధ్ బాగా సన్నిహితంగా ఉంటాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అయ్యాయి. ఆ సమయంలో ఇద్దరి గురించి బాగా ప్రచారం చేశారు. కీర్తి-అనిరుధ్ రిలేషన్‌లో ఉన్నారని, పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారంటూ కూడా రాశారు. ఒక్క కీర్తితో మాత్రమే కాదు, మిగతా హీరోయిన్స్‌తోనూ ఈ మ్యూజిక్ సెన్షేషన్ చాలా క్లోజ్‌గా ఉంటారట. మరి ఏం చెప్పి బుట్టలోకి వేసుకుంటాడో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news