Moviesకేక పెట్టించే న్యూస్‌: ఎన్టీఆర్ సినిమాలో విజ‌యశాంతి.. అత్త‌తో అల్లుడు దంచులాటే...!

కేక పెట్టించే న్యూస్‌: ఎన్టీఆర్ సినిమాలో విజ‌యశాంతి.. అత్త‌తో అల్లుడు దంచులాటే…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి సూపర్ పాన్ ఇండియా హిట్‌తో ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. త్రిబుల్ ఆర్ తర్వాత 6 నెలలుగా ఖాళీగా ఉన్న ఎన్టీఆర్ రెండు కొత్త సినిమాలుకు ఓకే చెప్పాడు. తన కెరీర్లో 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ 31వ సినిమా కేజీఎఫ్ సినిమాను దర్శకుడు ప్రశాంత నీల్ తెర‌క్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్నాయి. దీంతో కొరటాల, ప్రశాంత్ నీల్‌ సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం.

ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో వస్తున్న సినిమాపై గత కొద్దిరోజులుగా వార్తలు నానుతూనే ఉన్నాయి. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో కొరటాల ఈ సినిమా కథ‌, క‌థ‌నాలపై మరింత జాగ్రత్తగా ముందుకు వెళుతున్నాడు. ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఓ పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ కథలో భాగంగా ఉందట. ఈ పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటించ‌ బోతున్నట్టు తెలుస్తోంది.

విజయశాంతి పాత్ర సినిమాలో ఎన్టీఆర్‌కు అత్త పాత్ర అని నడుస్తోంది. అలాగే ఇంటర్వ్యూలో ఈ పాత్రకు సంబంధించి అదిరిపోయే ట్విస్ట్ కూడా రివీల్ అవుతుందని సమాచారం. అత్త‌, అల్లుడు మ‌ధ్య వ‌చ్చే సీన్లు సినిమాను మాంచి ర‌స‌కందాయంలో ప‌డేస్తాయ‌ట‌. గ‌తంలో న‌గ్మా, ర‌మ్య‌కృష్ణ‌లు అత్త‌గా, అల్లుడుగా ఎన్టీఆర్ చేసిన‌ప్పుడు కూడా మాస్‌కు మాంచి కిక్ వ‌చ్చింది. మ‌రోసారి మ‌నం అదే కిక్‌ను చూడ‌బోతున్నాం.
ఇక సినిమాలో ఎన్టీఆర్ లుక్‌ కూడా అదిరిపోతోందట. తన పాత్రకు తగ్గట్టుగా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్న ఎన్టీఆర్ ఏకంగా 8 నుంచి 10 కేజీల బరువు కూడా తగ్గేందుకు కసరత్తులు చేస్తున్నాడు. రీసెంట్‌గా ఎన్టీఆర్ అమిత్ షాను కలిసినప్పుడు కాస్త చ‌బ్బీ లుక్ లో ఉన్నాడు.

అయితే వారం రోజుల్లోనే ఎన్టీఆర్ చాలా సన్నబడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఏదేమైనా ఈ సినిమా కోసం కొరటాల, ఎన్టీఆర్ ఇద్దరు బాగా కసరత్తులు చేస్తున్నారన్న చర్చ‌లు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. ఇక గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news