Moviesనిర్మాత కొడుకుతో వరుణ్ తేజ్ హీరోయిన్ లవ్ ఎఫైర్....అప్పుడే మొదలెట్టిందా..?

నిర్మాత కొడుకుతో వరుణ్ తేజ్ హీరోయిన్ లవ్ ఎఫైర్….అప్పుడే మొదలెట్టిందా..?

ఒకప్పుడు హీరోల కొడుకులు మాత్రమే హీరోలుగా ఎంట్రీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు హీరోలు, నటుల కూతుర్లు కూడా హీరోయిన్ లుగా ఎంట్రీ సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాలీవుడ్ ప్రముఖ విలన్ మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది. ఎంట్రీ తోనే ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పక్కన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ బ్యూటీ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది.

ఇప్పటికే వరుణ్ తేజ్ కు జోడీగా గ‌ని సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా అడవి శేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా మేజర్ లో కూడా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మేజ‌ర్ పాన్ ఇండియా లెవ‌ల్లో రావ‌డంతో సాయి మంజ్రేక‌ర్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. అయిగే గ‌ని సినిమా మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ప్లాప్ అవ్వ‌డంతో సాయికి తెలుగులో ఆ త‌ర్వాత మంచి ఛాన్సులు రాలేదు.

ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరోయిన్ ల స్పీడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఎవరితో డేటింగ్ చేస్తారు చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలమే అయినా అప్పుడే సాయి మంజ్రేకర్ కూడా లవ్ ట్రాక్ మొదలు పెట్టింది అని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ అమ్మడు ఏకంగా నిర్మాత కొడుకుతోనే లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాజిద్ నడియా ద్వాలా కుమారుడు సుభాన్ నడియ‌డ్ వాలాతో హీరోయిన్ సాయి మంజ్రేకర్ క్లోజ్ గా ఉంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ లవ్ లో ఉన్నారని కూడా బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉండగా సుభాన్ న‌దియా త్వరలోనే డైరెక్టర్ గా పరిచయం అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తల పై ఇప్పటి వరకూ సాయి మంజ్రేకర్ స్పందించలేదు. మరి ఇందులో ఎంతవరకూ నిజం ఉందో ? తెలియాలి అంతే వేచి చూడాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news