Moviesలైగర్ సినిమా ఫ్లాప్ అయితే..పరిస్ధితి ఏంటి..? ఏడ్చేసిన ఛార్మీ..!!

లైగర్ సినిమా ఫ్లాప్ అయితే..పరిస్ధితి ఏంటి..? ఏడ్చేసిన ఛార్మీ..!!

సినీ ఇండస్ట్రీ అంటే మాయాలోకం అని అంతా అంటుంటారు. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని మరోసారి ప్రూవ్ చేసింది హీరోయిన్ ఛార్మీ. ఈ పేరు చెప్పితే ఒకప్పుడు కుర్రాళ్లు ఊగిపోయేవారు. ఆమె అందం , ఆమె నటన కి స్టార్ హీరోలు కూడా ఫిదా అయ్యారు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బిగ్ స్టార్స్ సినిమాల్లో అంటించి..స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఛార్మీ..అంతే త్వరగా ఆ లిస్ట్ నుండి దిగిపోయింది.

అయితే, ప్రజెంట్ ఆమె పలు సినిమాలు నిర్మిస్తూ నిర్మాత గా బిజీ అయిపోయింది. ప్రజెంట్ ఆమె పూరీ-విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా వెరైటీ గా ఛార్మీ నే పూరీని, విజయ్ ని ఇంటర్వ్యు చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో తాజా గా రిలీజైంది. ఈ ప్రొమో లో ఛార్మీ మాట్లాడుతూ ఏడ్చేసింది.

మనకు తెలిసిందే..ఈ సినిమా కరోనా కంటే ముందే స్టార్ట్ అయ్యింది. ఆ తరువాత లాక్ డౌన్ కారణంగా చాలా నెలలు సినిమా ఆగిపోయింది. దీంతో అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ పెరిగిపోయింది. చేతిలో ఒక్క రూపాయి కూడా లేని పరిస్ధితుల్లో సినిమా ను ఎలా నెట్టుకొచ్చామో మాకే తెలియదు అంటూ ఛార్మీ ఎమోషనల్ అయ్యింది. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న సమయంలో భారీ ఓటీటీ ఆఫర్ వచ్చినా..ఎందుకు రిజెక్ట్ చేసావ్ అంటూ పూరీని ఛార్మి ప్రశ్నించింది. భారీ బడ్జేట్ తో తీసిన సినిమా విజయం సాధించకపోతే, ఒక్కవేళ ప్రేక్షకులకు నచ్చకపోతే పరిస్థితి ఏంటి? అంటూ చార్మీ పూరీ ని స్ట్రైట్ గా అడిగేసింది. ఆ టైంలో నే పూరీ అందుకుని..” ఈ సినిమా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో..ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నావో నాకు తెలుసు..”అంటూ ప్రోమోని ఎండ్ చేసారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో మాత్రమే విడుదలైంది. పూరీ ఏం చెప్పి ఛార్మీని కూల్ చేసాడో తెలియాలంటే ఆగస్టు 19 వ తేదీ వరకు ఆగాల్సిందే .

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news