MoviesTL రివ్యూ: లైగ‌ర్ కాదు పిచ్చ‌ లైట్ తీస్కోండి...

TL రివ్యూ: లైగ‌ర్ కాదు పిచ్చ‌ లైట్ తీస్కోండి…

టైటిల్‌: లైగ‌ర్‌
నటీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే, మైక్ టైస‌న్‌, ర‌మ్య‌కృష్ణ‌, రోనిత్ రాయ్‌, విష్ణు రెడ్డి, గెట‌ప్ శ్రీను త‌దిత‌రులు
ఆర్ట్‌: జానీ షేక్ బాషా
ఎడిటింగ్‌: జునైద్ సిద్ధికి
ఫైట్స్ : కెచ్చా
మ్యూజిక్‌: అజీమ్ ద‌యానీ
సినిమాటోగ్ర‌ఫీ: విష్ణు శ‌ర్మ‌
స‌హ నిర్మాత‌: విష్ణు రెడ్డి
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ, య‌శ్ జోహార్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌
సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ
ర‌న్ టైం : 140 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 25 ఆగ‌స్టు, 2022
వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌: 90 కోట్లు

అతి త‌క్కువ టైంలోనే టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజీ స్టార్ అయిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అర్జున్‌రెడ్డి, గీత‌గోవిందం సినిమాలు, అత‌డి బిహేవియ‌ర్‌, బాడీ లాంగ్వేజ్‌, మాట తీరుకు యూత్ ఫిదా అయ్యి విజ‌య్ పిచ్చిలో ప‌డిపోయారు. ఇప్పుడు స్టార్ హీరోల‌కే స‌వాల్ విసురుతోన్న విజ‌య్ తాజా సినిమా లైగ‌ర్‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రోజు పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్ అవుతోంది. మాజీ ప్ర‌పంచ బాక్సింగ్ ఛాంపియ‌న్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా బ‌జ్ కొద్ది రోజులుగా ఊపేస్తోంది. టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో భారీ హైప్ తెచ్చుకున్న లైగ‌ర్‌కు విజ‌య్ కెరీర్‌లో హ‌య్య‌స్ట్‌గా రు. 90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. మ‌రి లైగ‌ర్ అంచ‌నాలు అందుకుందా ? పూరి త‌న మ్యాజిక్‌తో ఎంత వ‌ర‌కు మెస్మ‌రైజ్ చేశాడు అన్న‌ది TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
లైగర్ (విజయ్ దేవరకొండ) తల్లి బాలామణి (రమ్య కృష్ణ)తో కలసి మిక్స్ మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ఛాంపియ‌న్ అయ్యేందుకు క‌రీంన‌గ‌ర్ నుంచి ముంబై వ‌స్తాడు. అత‌డికి కోచింగ్ ఇచ్చేందుకు డబ్బులు ఇవ్వాల‌ని కండీష‌న్ పెడ‌తాడు కోచ్ (రోనిత్ రాయ్‌). అయితే బాలామ‌ణి గ‌తం చెప్ప‌డంతో రోనిత్ డ‌బ్బులు లేకుండానే లైగ‌ర్‌కు కోచింగ్ ఇచ్చేందుకు ఓకే చెపుతాడు. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నించే తాన్య ( అన‌న్య పాండే) లైగ‌ర్‌ను చూసి ఇష్ట‌ప‌డుతుంది. తాన్య మాయ‌లో ప‌డిన లైగ‌ర్ త‌న ల‌క్ష్యాన్ని మ‌ర్చిపోతాడు. లైగ‌ర్ కూడా త‌ల్లి మాట కాద‌ని తాన్య‌ను లేపుకు వ‌స్తాడు. ఆ త‌ర్వాత లైగ‌ర్‌కు న‌త్తి ఉంద‌న్న విష‌యం తెలుసుకున్న తాన్య అత‌డిని అనుమానించి బ్రేక‌ప్ చెపుతుంది ? ఆ త‌ర్వాత తాన్య ఏం చేసింది ? మైక్‌టైస‌న్ లైగ‌ర్ జీవితంలోకి ఎందుకు ? వ‌చ్చాడు ? చివ‌ర‌కు లైగ‌ర్ ఛాంపియ‌న్ అయ్యాడా ? లేదా ? అన్న‌దే క‌థ‌.

TL విశ్లేష‌ణ :
పూరి సినిమాల్లో హీరో క్యారెక్ట‌ర్ ప‌వ‌ర్ ఫుల్ ఎన‌ర్జీతో ఉంటుంది. అయితే ఈ సినిమా చూస్తుంటే అసలు రాసింది.. తీసింది పూరీయేనా ? అన్న‌ట్టుగా ఉంటుంది. ఈ సినిమాలో హీరోకు న‌త్తిపెట్ట‌డం డేరింగ్ స్టెప్‌. న‌త్తిని క‌థ‌లో వాడుకున్న తీరు కామెడీగా అనిపించింది. అస‌లు సినిమాలో ఒక ద‌శ దాటాక ఆ న‌త్తి భ‌రించ‌లేక బోర్ కొట్టేసింది. హీరో ఎంట్రీతోనే వంద‌మంది రౌడీల‌ను చిత‌క్కొట్టేస్తాడు. అప్పుడే ఇత‌డు సింపుల్‌గా ఛాంపియ‌న్ అయిపోతాడ‌న్న అంచ‌నాలు వ‌చ్చేస్తాయి. ఇలాంటి సినిమాల్లో ఫైట్లు సినిమాను ఆస‌క్తితో ముందుకు తీసుకుపోతాయి. ఈ సినిమాలో అవే త‌ప్పాయి. త‌మ్ముడులో ప‌వ‌న్ రింగ్‌లో చేసిన ఫైట్‌ను ప్రేక్ష‌కులు ఊపిరి బిగ‌బ‌ట్టి మ‌రీ చూస్తారు. ఇలాంటి స్పోర్ట్స్ క‌థ‌ల‌కు కావాల్సిన టెక్నీక్ అదే. చివ‌ర‌కు లైగ‌ర్ ల‌క్ష్యాన్ని కూడా వ‌దులుకుని వెళ్లిపోతాడు. అస‌లు రింగ్‌లో కాకుండా బ‌య‌ట ఎక్క‌డో గొడ‌వ ప‌డుతూ ఉంటాడు. ఆ గొడ‌వ‌ను కూడా లైవ్‌లో చూపిస్తారు. అస‌లు ఇదేంటో కూడా ప్రేక్ష‌కుడికి అర్థం కాదు.

ఇక హీరో త‌న ల‌క్ష్యం వ‌దిలేసి ప్రేయ‌సి కోసం వెళ్లిపోవ‌డం అర్థం కాదు. ఫ‌స్టాఫ్‌లో హీరోయిన్‌ను ఎలాగోలా ప్రేమ‌లో ప‌డేస్తాడు. పోనీ ఏదోలా ఫ‌స్టాఫ్‌ను భ‌రించాం.. సెకండాఫ్ బాగుంటుంద‌న్న ఆశ‌ల‌తో ఉన్న ప్రేక్ష‌కుడికి సెకండాఫ్ త‌ల‌నొప్పిగా మారుతుంది. లైగ‌ర్ కోసం విజ‌య్ మాత్రం ప్రాణ‌ప‌ణంగా క‌ష్ట‌ప‌డ్డాడు. బాడీ పెంచేందుకు ప‌డిన క‌ష్టం తెర‌మీద క‌నిపిస్తుంది. విజ‌య్ డ్యాన్సుల్లో ఇంకా మెరుగవ్వాలి. గ్రేస్ లేదు. అయితే ది గ్రేట్ మైక్ టైసన్ ని ఇండియన్ స్క్రీన్ మీదకి తెచ్చిన ఘనత పూరీకే ద‌క్కుతుంద‌నాలి. అయితే ఆ క్యారెక్ట‌ర్ ఎలివేష‌న్ మాత్రం వెరీ వీక్‌. ర‌మ్య‌కృష్ణ పాత్ర ఎమోష‌న‌ల్‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

పూరి ఏదో కాస్త బెట‌ర్ లైన్ రాసుకున్నాడు అనుకున్నా ఆ లైన్‌, క్యారెక్ట‌ర్‌ను ఆక‌ట్టుకునే స్థాయిలో తెర‌మీద ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడు. ప్ర‌తి సీన్‌లో అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా బోల్డ్‌నెస్ ఇరికించేశారు. యూత్‌ను ఎట్రాక్ట్ చేసేందుకు ఈ ప‌ని చేసి దెబ్బ‌తిన్నాడు. ఫ‌స్టాఫ్‌లో హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డే సీన్లు… సెకండాఫ్‌లో ల‌వ్ తాలూకూ ట్విస్ట్‌లు మ‌రీ సిల్లీగా ఉన్నాయి. మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్ ఎలివేష‌న్ కూడా వెరీ వీక్‌. ఈ సినిమా ఏదో మాస్ ఆడియెన్స్‌కు త‌ప్పా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు అస్స‌లు క‌నెక్ట్ కాదు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
పూరి సినిమాలంటే స్టోరీ పెద్దగా ఉండ‌దు. స్క్రీన్ ప్లేతో పాటు మాట‌ల్లో మ్యాజిక్ ఉంటుంది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ స్పీడ్గా, నెగ‌టివ్‌గా ఉంటూ దూసుకుపోతుంది. చాలా యేళ్లుగా ఫామ్‌లో లేక ఇస్మార్ట్ శంక‌ర్‌తో హిట్ కొట్టిన పూరి లైగ‌ర్ చూశాక ఇస్మార్ట్ శంక‌ర్ అనేది వ‌న్ టైం వండ‌ర్ అనేలా చేశాడు. లైగ‌ర్ ఖ‌చ్చితంగా పూరి వీక్ వ‌ర్క్‌లో ఒక‌టి. చాలా మంది సంగీత ద‌ర్శ‌కులు ఇచ్చిన పాట‌లు ఆక‌ట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌. సినిమాటోగ్ర‌ఫీ బాగున్నాయి. సినిమా ఎంతో బోర్ కొడుతున్నా తెర‌తిప్పుకోనివ్వ‌లేదంటే కార‌ణం విజువ‌ల్సే. చాలా చోట్ల అవ‌స‌రానికి మించి ఖ‌ర్చు చేశారు. ఎడిటింగ్ ర‌న్ టైం క్రిస్పీగా ఉన్నా మ‌రో 10 – 15 నిమిషాలు ట్రిమ్ చేసేయ‌వ‌చ్చు అనిపించింది.

ఫైన‌ల్‌గా…
పూరీ జగన్నాథ్ వీకెస్ట్ సినిమాల్లో లైగ‌ర్ ఒక‌టిగా నిలిచిపోతుంది. విజ‌య్ పూరితో సినిమా చేస్తుంటే మెంట‌లెక్కిపోయింద‌న్నాడు. కానీ సినిమా చూస్తుంటే నిజంగానే మెంట‌ల్ ఎక్కేసింది. పూరి ఈ కాస్ట్ లీ ఎటెంప్ట్‌ను పూర్తిగా డిజ‌ప్పాయింట్ చేసేశాడు. అస‌లు విజ‌య్ లేక‌పోతే ఈ సినిమాను రెండు గంట‌ల పాటు భ‌రించ‌డం చాలా చాలా క‌ష్టం.

ఫైన‌ల్ పంచ్ :
లైగ‌ర్ కాదు పిచ్చ లైట‌ర్‌

లైగ‌ర్‌ TL రేటింగ్ : 2 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news