Movies' స‌ర్కారువారి పాట ' 100 డేస్ సెంట‌ర్స్ లిస్ట్‌... ఆ...

‘ స‌ర్కారువారి పాట ‘ 100 డేస్ సెంట‌ర్స్ లిస్ట్‌… ఆ ఊళ్లో మ‌ళ్లీ మ‌హేష్ రికార్డ్‌…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు 2020 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత రెండున్న‌రేళ్ళకు స‌ర్కారు వారి పాట సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. స‌మ్మ‌ర్ కానుక‌గా మే 12న భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమాలో మ‌హేష్ క్యారెక్ట‌రైజేష‌న్‌, ఎన‌ర్జీ గ‌త సినిమాల కంటే చాలా డిఫ‌రెంట్‌గా ఉంది. గీత‌గోవిందం సినిమా త‌ర్వాత ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది.

అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు రావ‌డంతో పాటు ఫ‌స్ట్ వీక్ త‌ర్వాత బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స్ట్రాంగ్‌గా నిల‌బ‌డ‌క‌పోవ‌డంతో కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించ‌లేదు. ఇందుకు కార‌ణం భారీ బ‌డ్జెట్‌తో పాటు ఎక్కు రేట్ల‌కు అమ్మ‌డం కూడా ఓ మైన‌స్‌. ఇక 8 సెంట‌ర్ల‌లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రు. 100 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టింది. ఇక ఈ రోజు ఈ సినిమా రెండు సెంట‌ర్ల‌లో 100 రోజులు పూర్తి చేసుకుంది.

మేలో రిలీజ్ అయిన స‌ర్కారు వారి పాట జోరుకు మేజ‌ర్‌, విక్ర‌మ్ రెండు సినిమాలు బ్రేక్ వేయ‌డంతో ఈ సినిమాకు కొంత దెబ్బ ప‌డింది. ఈ రోజు ఈ సినిమా గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట కృష్ణ‌మ‌హాల్‌, వైజాగ్‌లోని గోపాల‌ప‌ట్నం మైర్య థియేట‌ర్ల‌లో డైరెక్ట్ 4 ఆట‌ల‌తో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను 14 రీల్స్‌, మైత్రీ మూవీస్ వాళ్లు సంయుక్తంగా నిర్మించారు.

ఇక గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట అంటేనే టాలీవుడ్ స్టార్ హీరోల‌కు అడ్డాగా మారిపోయింది. అక్క‌డ స్టార్ హీరోల సినిమాలు యావ‌రేజ్‌గా ఉన్నా 100 రోజులు ఆడేస్తున్నాయి. బాల‌య్య అఖండ ఇటీవ‌లే అదే ఊర్లో రామ‌కృష్ణ థియేట‌ర్లో ఏకంగా 175 రోజులు ఆడింది. ఇప్పుడు ఆ వెంట‌నే మ‌హేష్ స‌ర్కారు వారి పాట కూడా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఏదేమైనా బాల‌య్య 175 కొట్టిన చోట వెంట‌నే మ‌హేష్ సెంచ‌రీ కొట్టేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news